Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!

Railway Track Car Driving: ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురి అవుతున్నారు. జీవనశైలి పూర్తిగా మారడంతో పాటు వ్యక్తిగత విషయాలు, ఉద్యోగం ఇలా అన్నింట్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. బాగా ఒత్తిడికి లోనై మానసిక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం రంగారెడ్డిలో ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపించి అధికారులకు పట్టపగలే చుక్కలు చూపించింది. అయితే ఆ యువతి ఎందుకు అలా చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆ ఉద్యోగం పోవడంతో ఆమె మానసికంగా ఒత్తిడికి గురై ఇలా చేసినట్లు తెలిపింది. ఒక్కసారిగా ఉన్న ఉద్యోగం పోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రస్తుతం రోజుల్లో ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. దీనికి తోడు సాఫ్ట్‌వేర్ అంటే వారికి ఎక్కువగా అప్పులు ఉంటాయి. ఉద్యోగం పోతే నెల వచ్చేసరికి ఈఎంఐలు ఎలా కట్టాలనే టెన్షన్ ఉంటుంది. వీటివల్ల ఆ యువతి ఇలా రైల్వే ట్రాక్‌పై కారు నడిపినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఉద్యోగం పోవడంతో ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడటంతో బీభత్సంగా తాగి ఇలా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రమైన ఒత్తిడి, అసాధారణ స్థితి వల్ల ఆ యువతి తనకి తెలియకుండా ఇలా రైలు ప్రయాణాలకు అంతరాయం కలిగించిందని తెలుస్తోంది.
Railway track turned road: Woman’s drive sparks panic near #Shankarpally
Woman drives car on #railwaytrack near #Shankarpally, stuns #railway staff.
Despite efforts to stop her, she speeds away.#Bengaluru–#Hyderabad trains halted as a precaution.
Authorities… pic.twitter.com/k87nVKeF1u
— NewsMeter (@NewsMeter_In) June 26, 2025
అసలు ఏమైందంటే?
రంగారెడ్డిలోని రైల్వే ట్రాక్ మీద ఓ మహిళ ఫుల్‌గా తాగి రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్‌పై వేగంగా కారు నడిపింది. రైలు ట్రాక్ మీద ఆమె వేగంగా కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆమెను అధికారులకు దొరకుండా, రైలు ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తూ ఓ యువతి రైల్వే ట్రాక్‌పై కారు నడిపింది. ఆమెను గమనించిన లోకో పైలెట్లు రైలు ఆపి మిగతా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆపడానికి చాలా ప్రయత్నించారు. అలా చేసిన వారికి ఆమె కత్తి చూపించి బెదిరించింది. చివరకు అధికారులు అందరూ కష్టపడి ఆమెను పట్టుకున్నారు. అయితే అతిగా తాగడం వల్ల ఇలా రైలు గడుపుతుందని, మరికొందరు ఫేమస్ కావాలని రీల్స్ చేసిందని అనుకున్నారు. కానీ ఆమె ఉద్యోగం పోవడం వల్ల ఇలా చేసిందని చివరకు పోలీసుల విచారణలో తేలింది.
సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఒత్తిడితో కూడుకున్నది. ఎంత లక్షల్లో జీతాలు వచ్చినా కూడా ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఈ ఒత్తిడిని భరించలేక ఎందరో ఆత్మహత్య చేసుకున్నవారు కూడా ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే సిస్టమ్ ముందు కూర్చోని ఉంటే సరిపోతుందని, ఏసీలో కూర్చోని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. ఇదంతా కేవలం పైకి కనిపించింది మాత్రమే. పైకి కనిపించనిది ఏంటంటే.. ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు అన్ని కూడా వస్తాయి. వీటివల్ల తర్వాత అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి.
Read Also:Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు