Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు

Viral Video : ప్రకృతి విపత్తులు ఎంత దారుణంగా ఉంటాయో మరోసారి రుజువైంది. ఇప్పటికే ఎన్నో సార్లు భారీ వర్షాలకు ఇళ్లు, జనాలు, కార్లు కొట్టుకోవడం చూశాం. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న స్వాతీ నదిలో హఠాత్తుగా వచ్చిన వరదలు ఒక కుటుంబాన్ని కబళించాయి. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వరద ప్రవాహంలో చిక్కుకున్న కుటుంబం ప్రాణాల కోసం ఎలా పోరాడిందో, కళ్ళెదుటే ఎలా కొట్టుకుపోయిందో చూస్తే గుండె బద్దలవుతుంది. ఈ ఘటనలో సుమారు 18 మంది కుటుంబ సభ్యులు గల్లంతయ్యారని, వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు.
వర్షాలు ఎక్కువగా పడటం వల్ల స్వాతీ నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిపోయింది. నది నిండుగా ప్రవహించడంతో ఒడ్డున ఉన్న ప్రాంతాలు మునిగిపోయాయి. ఇదే సమయంలో ఒక పర్యాటక బృందం ఈ వరదల్లో చిక్కుకుంది. క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో, వాళ్లంతా అందులో కొట్టుకుపోయారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో కుటుంబ సభ్యులు ఒకరినొకరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, నీటి ఉద్ధృతిని తట్టుకోవడానికి పోరాడుతున్న దృశ్యాలున్నాయి. కొందరు కళ్ళముందే కొట్టుకుపోతుంటే, మిగతావాళ్ళు నిస్సహాయంగా చూస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.
Read Also:Gukesh : కార్ల్‌సన్‌ను మరోసారి చిత్తు చేసిన గుకేశ్.. భారత చెస్ సంచలనం రికార్డు విజయం!
Pakistan: 15 members of a family hailing from Sialkot, Punjab were swept away in the Swat River due to flood in Mingora, Swat.
Eyewitness claim family cried, screamed and waited for hours for help from Pak Govt, Army and Police But No one came pic.twitter.com/c3awMtSsd6
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2025
రెస్క్యూ అధికారులు చెప్పిన దాని ప్రకారం.. స్వాతీ బైపాస్ దగ్గరలోని జీఈ కుర్బాన్ హోటల్ వద్ద ఈ ఘోరం జరిగింది. ఇక్కడ వరదలు చాలా తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. అందులో ఆరు మృతదేహాలు జీఈ కుర్బాన్ హోటల్ దగ్గర, మూడు అంగ్రో ధేరి వద్ద, మరో మూడు రిలాక్స్ హోటల్ సమీపంలో లభించాయి.
ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్షియల్ ప్రభుత్వం వెంటనే పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. సుమారు 120 మంది సిబ్బందిని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో మోహరించింది. నది వెంట వివిధ ప్రదేశాల్లో సుమారు 80 మంది చిక్కుకుపోగా, అందులో 63 మందిని సురక్షితంగా రక్షించగలిగారు అని రెస్క్యూ అధికారులు తెలిపారు. గత నెలలో కూడా పాకిస్తాన్లో తుఫానుల వల్ల కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 240 మిలియన్లకు పైగా జనాభా ఉన్న పాకిస్తాన్, వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే దేశాలలో ఒకటి.
Read Also:Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్లో మెరిసిన భారత ఆణిముత్యం
-
Rishabh Pant: ఫ్రస్టేషన్లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది
-
Mohan Babu : న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న మంచు మోహన్ బాబు విష్ణు.. అసలు నిజం వెలుగులోకి
-
Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది
-
Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!