Gukesh : కార్ల్‌సన్‌ను మరోసారి చిత్తు చేసిన గుకేశ్.. భారత చెస్ సంచలనం రికార్డు విజయం!

Gukesh : భారత యువ చెస్ సంచలనం, డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ మరోసారి ప్రపంచ నంబర్ 1 చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ కు షాకిచ్చాడు. గతంలోనూ మాగ్నస్‌ను ఓడించిన గుకేశ్, ఇప్పుడు క్రొయేషియాలో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్-2025 గ్రాండ్ చెస్ టూర్ ఆరో రౌండ్లో మళ్ళీ కార్ల్‌సన్‌పై సంచలన విజయం సాధించాడు. ఈ గెలుపుతో గుకేశ్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ కీలక విజయంతో గుకేశ్ చెస్ ప్రపంచంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.
క్రొయేషియాలో జరుగుతున్న ఈ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్-2025 గ్రాండ్ చెస్ టూర్ లో గుకేశ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆరో రౌండ్లో మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించడం ద్వారా, గుకేశ్ తన వరుస విజయాలను కొనసాగించాడు. టోర్నీలో ఇప్పటికే వరుసగా ఐదు విజయాలు సాధించి, రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఈ గెలుపు గుకేశ్‌కు టోర్నీలో మరింత కాన్ఫిడెన్స్ అందించింది. మాగ్నస్ కార్ల్సన్ కు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా పేరుంది. అలాంటి ప్లేయర్‌ను మళ్ళీ మళ్ళీ ఓడించడం గుకేశ్ లెవల్ ఏంటో తెలుస్తోంది.
Read Also:Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్లో మెరిసిన భారత ఆణిముత్యం
కార్ల్‌సన్‌కు మరోసారి చెక్ పెట్టిన గుకేశ్
వరల్డ్ No.1 చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ మరోసారి ఓడించారు. క్రోయేషియాలో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్-2025 గ్రాండ్ చెస్ టూర్ ఆరో రౌండ్లో మాగ్నస్‌పై గుకేశ్ విజయం సాధించారు. టోర్నీలో వరుసగా 5… pic.twitter.com/eMGfjM7Y1W
— ChotaNews App (@ChotaNewsApp) July 4, 2025
ఈ టోర్నీలో భాగంగా నేటితో (జులై 4, 2025) ర్యాపిడ్ చెస్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ర్యాపిడ్ చెస్ అంటే, ఆటగాళ్లకు ఆలోచించడానికి తక్కువ సమయం ఉంటుంది. ఆ తర్వాత బ్లిట్జ్ ఫార్మాట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. బ్లిట్జ్ చెస్ అంటే ర్యాపిడ్ కంటే ఇంకా తక్కువ సమయం ఉంటుంది. ఈ రెండు ఫార్మాట్లలోనూ గుకేశ్ గతంలో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. గుకేశ్, మాగ్నస్ కార్ల్సన్ ఇద్దరూ ఈ టోర్నీలో మరో రెండు గేముల్లో తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లు కూడా చాలా ఉత్కంఠగా ఉంటాయని చెస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
గుకేశ్ ఇటీవల కాలంలో భారత చెస్‌లో ఒక సంచలనంగా మారాడు. 2024 క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి, ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను సవాలు చేసే అవకాశం పొందిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని వ్యూహాత్మక ఆటతీరు ప్రపంచంలోని పెద్ద పెద్ద చెస్ దిగ్గజాలకు సవాలు విసురుతున్నాయి. మాగ్నస్ కార్ల్‌సన్‌పై మళ్ళీ మళ్ళీ గెలవడం గుకేశ్ ఆటతీరుకు నిదర్శనం.
Read Also:Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?