Brain Sharp: బ్రెయిన్ షార్ప్ కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Brain Sharp:
ఏ పని చేయకుండా అలా ఉండిపోతే బ్రెయిన్ మొద్దుబారిపోతుంది. బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తుండాలి. అప్పుడే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. ఏ పని చేయకుండా అలా ఉండిపోతే బ్రెయిన్ పూర్తిగా డెడ్ అవుతుంది. ఏ విషయం గురించి కూడా పెద్దగా ఆలోచించలేరు. దీంతో మీ బ్రెయిన్ కూడా అన్ని విషయాలను ఆలోచించకుండా ఉండేందుకు అలవాటు అయిపోతుంది. అయితే బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. డైలీ వాటిని పాటించడం వల్ల బ్రెయిన్ ఆటోమెటిక్‌గా షార్ప్ అవుతుంది. మరి బ్రెయిన్ షార్ప్ కావడానికి పాటించాల్సిన ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.
నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలి
ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. కొత్త కొత్త విషయాలు, స్కిల్స్ వంటివి నేర్చుకుంటే మీ బ్రెయిన్ బాగా మెరుగుపడుతుంది. ఉదాహరణకు మీకు వంట చేయడం రాదు అనుకోండి. డైలీ వంట చేయడం, కొత్త కొత్త వంటలు ట్రై చేయడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్‌గా అవుతుంది.
పజిల్స్
పజిల్స్, చెస్ ఆడటం వంటివి చేస్తే బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. అందులో లాజిక్స్ ఉండటం వల్ల అవి బ్రెయిన్‌ను బాగా షార్ప్ చేస్తాయి. ఇవే కాకుండా సుడుకో వంటి బ్రెయిన్ ఛాలెంజింగ్ వంటివి ఆడటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
నిద్ర
ప్రతీ మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రపోవడం వల్ల మైండ్ పవర్ కూడా పెరుగుతుంది. ఏ విషయాన్ని అయినా కూడా సరిగ్గా ఆలోచించగలరు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా నిద్ర అనేది ముఖ్యం.
పోషకాలు ఉండే ఫుడ్
ప్రొటీన్స్ అవి పుష్కలంగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం వల్ల మైండ్ పనితీరు మెరుగుపడుతుంది. లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఒకే జోనర్‌లో ఆలోచిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు రావాలంటే మాత్రం తప్పకుండా పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోండి.
కొత్త భాష
మీకు కేవలం ఒక లాంగ్వేజ్ మాత్రమే వస్తే.. కొత్త భాషలు నేర్చుకోండి. వీటివల్ల మీ బ్రెయిన్ షార్ప్‌గా అవుతుంది. వీటితో పాటు పుస్తకాలు చదవడం, యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల కూడా ఆలోచన పెరుగుతుంది. వీటివల్ల మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చాలా కూల్‌గా థ్రింక్ చేస్తారు. పెద్ద సమస్య అయినా కూడా మీకు చిన్నగానే కనిపిస్తుంది. యోగా అనేది మీకు ఆరోగ్య పరంగా కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. డైలీ ఒక అరగంట పాటు అయినా కూడా యోగా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. పిల్లలకు చిన్నప్పటి నుంచే యోగా చేయడం అలవాటు చేసుకోండి.