Blood Pressure: హైబీపీని తగ్గించుకోవడం ఎలా అంటే?

Blood Pressure: మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మద్యపానం, మాంసాహారం, ఆహార అలవాట్ల వల్ల రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అధికంగా కోపం, ఒత్తిడికి గురి కావడం వల్ల ఒక్కోసారి బీపీ పెరిగిపోతుంది. బీపీ కనుక ఎక్కువ అయితే అనారోగ్య సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు అనేది సరైన సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం, ఇంట్లో సమస్యలు, ఒత్తిడి, ఉద్యోగం వంటి సమస్యల వల్ల వస్తుంది. రక్తపోటు సమస్య రాకూడదంటే మాత్రం డైలీ యోగా, వ్యాయామం వంటివి చేయాలి. చిన్న విషయానికి ఒత్తిడికి గురి కాకూడదు. కొందరు చిన్న విషయానికి కూడా కోపానికి గురవుతుంటారు. ఇలా కాకూడదంటే మాత్రం డైలీ ఒక గంట పాటు వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. వీటితో పాటు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
రక్తపోటు పెరగకుండా తగ్గాలంటే ఆహార అలవాట్లు కూడా మార్చాలి. ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా మసాలా ఫుడ్స్ తీసుకుంటున్నారు. వీటిని కాకుండా ఆరోగ్యమైన ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. దీనివల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఎవరికైనా కూడా రక్తపోటు లిమిట్‌లోనే ఉండాలి. కాస్త ఎక్కువ లేదా తక్కువ అయినా కూడా ప్రమాదమే. రక్తపోటు తగ్గాలంటే తక్కువగా ఉప్పు తీసుకోవాలి. అలాగే సరిగ్గా నిద్రపోవాలి. రోజుకి కనీసం 8 గంటలు అయినా నిద్రపోవాలి. మద్యం, ధూమపానం మానేయాలి. డైలీ వ్యాయామం చేయాలి. ఏదో ఒకరోజు చేసి ఆపేయడం కాకుండా డైలీ ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం చేయలేని వారు యోగా, మెడిటేషన్ అయినా కూడా చేయవచ్చు. హ్యాపీగా నిద్రపోతూ ఒత్తిడికి గురి కాకుడదు. అలాగే బరువు ఎక్కువగా ఉంటే తగ్గండి. అధిక బరువు వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ బరువు మాత్రమే ఉండండి.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం ఒక ఎత్తు. ప్రొటీన్లు, పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కేవలం రక్తపోటు మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు ఎంత వరకు అదుపులో ఉంటే అంత మంచిది. ప్రతీ ఒక్కరికి 120 /80 ఉండాలి. దీని కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Blood Pressure: అధిక రక్తపోటు సమస్య ఉందా.. వీటిని తీసుకోండి
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Weight loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే జిమ్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు
-
Yoga : వీటిని గుర్తు పెట్టుకోకపోతే యోగా చేయడం వేస్ట్..ప్రయోజనం ఉండదు..
-
Brain Sharp: బ్రెయిన్ షార్ప్ కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి