Blood Pressure: ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. మీకు రక్తపోటు అధికం కావడం పక్కా

Blood Pressure: ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అయితే పోషకాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం, ఉప్పు, ఆందోళన వంటి సమస్యల వల్ల అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అయితే రక్తపోటు అధికం అయితే మాత్రం గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలిసో తెలియక కొన్ని వస్తువులను తినడం వల్ల రక్తపోటు పెరిగి గుండె పోటు వస్తుంది. ఫాస్ట్ ఫుడ్‌కి బాగా అలవాటు పడి, తెలిసో తెలియక కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రక్తపోటు పెరగకుండా ఉండాలంటే వేటిని ఎక్కువగా తీసుకోకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
ఉప్పు
ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. మనం ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకున్నప్పుడు శరీరంలో రక్తం పరిమాణం పెరిగి.. రక్తపోటు పెరుగుతుంది. మార్కెట్‌లో లభించే ప్రాసెస్ చేసిన ఆహారాలు చిప్స్, ప్యాక్ చేసిన వాటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఉప్పు తీసుకోవడం తగ్గించుకుంటే వీరు సిస్టోలిక్ రక్తపోటు 4-8mmHg తగ్గుతుందని అనేక పరిశోధకులు చెబుతున్నారు. అలాగే కాస్త ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఒత్తిడి
దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును పెంచుతాయి. ఒత్తిడి, ఆందోళన లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి తగ్గడానికి వ్యాయామాలు చేయాలి. అలాగే యోగా, తేలికపాటి వ్యాయామాలు, మెడిటేషన్ వంటివి చేయడం, సరిగ్గా నిద్రపోవడం వంటివి చేస్తే ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అధికంగా ఉంటే ఇంకా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న విషయానికి కూడా ఆలోచించకుండా సంతోషంగా ఉండాలి.
స్క్రీన్ సమయం
టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఎక్కువ సమయం గడపడం వల్ల ఒకే ప్లేస్‌లో ఉండాల్సి వస్తుంది. దీనివల్ల ఎలాంటి శారీరక శ్రమ ఉండదు. దీంతో నిద్ర పట్టకపోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం, కండరాల బలహీనత వంటివి వస్తాయి. ఇవి కూడా కొన్నిసార్లు రక్తపోటుకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా మొబైల్ చూడవద్దు. అలాగే స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. ప్రతి గంటకు ఒకసారి లేచి చిన్న నడక లేదా స్ట్రెచ్ చేయండి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా పడుకునే ముందు స్క్రీన్ వాడకాన్ని తగ్గించుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?
-
Beetroot: వీరు బీట్‌రూట్ తిన్నారో.. అంతే సంగతులు.. ఇక ప్రాణాలు పైకే!
-
Mental Stress : యువతకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. దేశ భవిష్యత్తుకు ప్రమాదమా?
-
Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?
-
premature aging in men : అబ్బాయిలు ఈ మిస్టేక్స్ చేశారో.. వృద్ధాప్యం గ్యారెంటీ
-
Stress: ఒత్తిడి చంపేస్తుందా.. అయితే ఇలా బయటపడండి
-
Blood Pressure: హైబీపీని తగ్గించుకోవడం ఎలా అంటే?