premature aging in men : అబ్బాయిలు ఈ మిస్టేక్స్ చేశారో.. వృద్ధాప్యం గ్యారెంటీ
premature aging in men : ఈ రోజుల్లో అబ్బాయిలు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డారు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కూడా తొందరగా ముసలితనం వస్తుందని నిపుణులు

premature aging in men : మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల పురుషులు తొందరగా ముసలివారు అవుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్, ఒత్తిడి, ఆందోళన వల్ల మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు. ఇలాంటి వాటి వల్ల చాలా మంది పురుషులు యంగ్ ఏజ్‌లోనే వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే తినే ఫుడ్, కొన్ని ఆహార అలవాట్ల ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే పురుషుల్లో వృద్ధాప్య సమస్యలు రాకూడదంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి అలవాట్ల వల్ల వస్తుంది? దీనికి పరిష్కారం ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
మద్యపానం
ఈ మధ్య కాలంలో పురుషులు ఎక్కువగా మద్యపానం, ధూమపానం వంటివి సేవిస్తున్నారు. వీటివల్ల తొందరగా వృద్ధాప్యం వస్తు్ందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సేవిస్తున్నారు. ధూమపానం కాలేయంతో పాటు శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మద్యపానం బాడీని డీహైడ్రేట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. వీటివల్ల తొందరగా ముఖంపై ముడతలు, మొటిమలు రావడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి యంగ్ లుక్‌లో ఉండాలంటే తప్పకుండా వీటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
సూర్యరశ్మి
సూర్యరశ్మి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఉదయం సాయంత్రం, వేళలో ఉన్న సూర్యరశ్మి వల్ల బాడీకి విటమిన్ డి అందుతుంది. కానీ కొందరు రోజులో ఎక్కువగా సూర్యరశ్మిలో ఉంటారు. ఇలా ఎక్కువగా సూర్యరశ్మిలో ఉంటే అధిక వేడి వల్ల తొందరగా వృద్ధాప్యం వస్తుందట. అంటే ఎండలో ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ బయటకు వెళ్తే సన్ స్క్రీన్ వంటివి రాయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా సూర్యరశ్మిలో ఉండవద్దు.
డీహైడ్రేట్
కొందరు సరిగ్గా వాటర్, ఫుడ్ వంటివి తీసుకోరు. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మం పొడి బారడంతో పాటు నల్లగా మారుతుంది. చర్మం క్లియర్‌గా లేకుండా ముడతలు, మచ్చలు వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బాడీకి సరిపడా వాటర్ తాగండి. లేకపోతే వృద్ధాప్యం తొందరగా రావడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెస్ ఫుడ్
ఈ రోజుల్లో అబ్బాయిలు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డారు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కూడా తొందరగా ముసలితనం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫుడ్‌లో పోషకాలు ఎక్కువగా ఉండవు. మసాలా వల్ల పురుషుల్లో తొందరగా ముసలితనం వస్తుందని అంటున్నారు. ఈ ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం వల్ల చర్మ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడి
పని ఒత్తిడి, ఇంట్లో సమస్యల వల్ల కొందరు ఎక్కువగా ఆందోళనకు చెందుతుంటారు. తీవ్రంగా ఒత్తిడికి గురి కావడం వల్ల తొందరగా ముసలితనం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటం వల్ల యంగ్ లుక్‌లో ఎక్కువగా ఉంటారని నిపుణులు
-
COPD : విపరీతమైన దగ్గు, ఆయాసం వస్తుందా.. ఇది సాధారణమా లేదా ప్రమాదకరమా ?
-
Blood Pressure: ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. మీకు రక్తపోటు అధికం కావడం పక్కా
-
Viral Video: భార్యాభర్తలు పాలు కాదు.. సిగరెట్ పంచుకోవాలి.. వైరలవుతున్న వీడియో
-
Urinary Infection : మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ 7 వ్యాధులకు సంకేతం కావచ్చు!
-
Kidney Stones : వేసవిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదం.. ఎందుకు పెరుగుతాయి? ఎలా జాగ్రత్త పడాలి?
-
Stress: ఒత్తిడి చంపేస్తుందా.. అయితే ఇలా బయటపడండి