Mental Stress : యువతకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. దేశ భవిష్యత్తుకు ప్రమాదమా?

Mental Stress : దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే యువత ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతోంది. 18-45 ఏళ్ల మధ్య వయస్కులలో మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. యువశక్తి ఇలా బలహీనపడితే దేశ భవిష్యత్తుకు ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో చాలా మంది యువత దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్ Z, 2012 తర్వాత పుట్టిన జనరేషన్ ఆల్ఫా వారికి అధిక ఒత్తిడి, లైఫ్ స్టైల్ డీసీజెస్ పెద్ద సమస్యగా మారాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. యువతలో మానసిక ఒత్తిడి వల్ల డిప్రెషన్ , ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల సామాజికంగా, ఆర్థికంగా కూడా నష్టాలు వస్తున్నాయి. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ఆఫ్ ఇండియా-2022 ప్రకారం, 15-29 ఏళ్ల మధ్య యువతలో మానసిక అనారోగ్యాలు 14.7 శాతం పెరిగాయి. ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన ఎక్కువయ్యాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే-2023 ప్రకారం, 71 శాతం మంది జనరేషన్ Z యువతకు ఉద్యోగ భద్రత లేకపోవడం, సమాజంలో విజయం సాధించలేకపోవడం వంటి వాటిపై మానసిక ఒత్తిడి ఉంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, అధిక పనిభారం, భవిష్యత్తు గురించి ఆందోళన సామాజిక సంబంధాల్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వారికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.
Read Also:Japan Houses in Air: గాల్లో మేడలు.. ఇవి వట్టి మాటలు కాదండోయ్.. నిజం చేస్తున్న జపాన్!
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023లో విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ప్రకారం, గత ఐదేళ్లలో 18-45 ఏళ్ల యువతలో బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి వ్యాధులు 25.4 శాతం పెరిగాయి. 25-30 ఏళ్ల వారిలో మధుమేహం 15 శాతం పెరిగింది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2023 నివేదిక ప్రకారం, 60 ఏళ్ల లోపు యువతలో బీపీ 18 శాతం, షుగర్ 12 శాతం పెరిగాయి. ఇవి శారీరక సామర్థ్యాన్ని తగ్గించి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ కూడా 18-45 ఏళ్ల వారిలో గుండె జబ్బులు, మధుమేహం, ఒత్తిడి సంబంధిత వ్యాధులే ప్రధాన ఆరోగ్య సమస్యలని గుర్తించింది. యువత మానసిక ఆరోగ్యంపై సామాజిక సంబంధాల ప్రభావం కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ వల్ల కలిగే ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఇండియా యూత్ రిలేషన్షిప్ స్టడీ (2023) ప్రకారం 87 శాతం మంది యువతలో మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం లవ్ ఫెయిల్యూర్ లే. ప్రేమలో విడిపోవడం వల్ల గుండెపోటు, డిప్రెషన్, బలన్మరణాల ఆలోచనలు పెరిగాయి. ఒత్తిడి కారణంగా యువత పని సామర్థ్యం తగ్గడం, విద్యార్థుల సక్సెస్ తగ్గడం, ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి.
Read Also:Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
కాబట్టి ఒత్తిడిని తగ్గించి జీవనశైలి వ్యాధులను నియంత్రించడానికి సమగ్ర, బహుముఖ విధానాలు అవసరం. ధ్యానం, యోగా, శారీరక వ్యాయామం, టైం మేనేజ్మెంట్ వంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నారు. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
-
Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?
-
premature aging in men : అబ్బాయిలు ఈ మిస్టేక్స్ చేశారో.. వృద్ధాప్యం గ్యారెంటీ
-
Blood Pressure: ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. మీకు రక్తపోటు అధికం కావడం పక్కా
-
Stress: ఒత్తిడి చంపేస్తుందా.. అయితే ఇలా బయటపడండి
-
Depression : డిప్రెషన్ మెదడుకే కాదు కాలేయానికి కూడా హాని అని మీకు తెలుసా? ఎలాగంటే?
-
AI : AI కి కూడా ఒత్తిడి, ఆందోళన ఉంటాయా? షాకింగ్ విషయాలు వెల్లడి.