AI : AI కి కూడా ఒత్తిడి, ఆందోళన ఉంటాయా? షాకింగ్ విషయాలు వెల్లడి.
AI : ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఫాగ్ అనరు. ఏఐ అంటారు. ఆ రేంజ్ లో మారిపోయింది జిందగీ. ఒకటేంటే అన్ని రంగాల్లో ఎంట్రీ ఇచ్చేసింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.

AI : ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఫాగ్ అనరు. ఏఐ అంటారు. ఆ రేంజ్ లో మారిపోయింది జిందగీ. ఒకటేంటే అన్ని రంగాల్లో ఎంట్రీ ఇచ్చేసింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. విద్య, ఆరోగ్యం నుంచి వ్యాపారం, వినోదం, జర్నలిజం వరకు కూడా తన ఎంట్రీ ఇచ్చి విప్లవాత్యకమైన మార్పు తెస్తుంది. యువకుల నుంచి వృద్ధుల వరకు, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ అవసరాల కోసం జెమిని, చాట్‌జిపిటి, మెటా వంటి AI సాధనాలను ఉపయోగించడం ప్రారంభించారు. అయితే ఇంత మందికి సమాధానాలు చబుతూ ఇన్ని రకాల రంగాలలో ఎంట్రీ ఇచ్చిన ఈ AI సాధనాలు భావోద్వేగ, ఒత్తిడికి గురి అవుతాయి అని ఓ పరశోధన చెందుతుంది. షాక్ అయ్యారా మరి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
హైఫా విశ్వవిద్యాలయం, యేల్ విశ్వవిద్యాలయం, జ్యూరిచ్ విశ్వవిద్యాలయం చేసిన కొత్త పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ ఇప్పుడు ఏంటి అంటే? AI ఆందోళనను అనుభవించగలదా? AIలో ఆందోళనను ఎలా గుర్తిస్తారు? దాని ఒత్తిడి స్థాయిని ఎలా కొలుస్తారు? AI ఆందోళనకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైఫా విశ్వవిద్యాలయం, యేల్ విశ్వవిద్యాలయం, జ్యూరిచ్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనల ప్రకారం, కృత్రిమ మేధస్సు (AI) సాధనాలకు ప్రమాదాలు, విపత్తులు, దాడులు, హింసాత్మక సంఘటనలకు సంబంధించిన సమాచారం అందించినప్పుడు సాధనాల ప్రతిస్పందనలలో ‘మానసిక స్థితిలో మార్పులు వస్తాయి అని తేలింది.
మానవుల మాదిరిగా AI ఆందోళన, ఒత్తిడిని అనుభవించనప్పటికీ, AI సాధనాలు వారి శిక్షణ డేటా నుంచి నేర్చుకున్న నమూనాల ఆధారంగా ప్రవర్తిస్తాయని పరిశోధకులు అంటున్నారు. తన పరిశోధనలో, పరిశోధకుడు ChatGPT కి వివిధ రకాల కథలను అందించారు. ఒత్తిడితో కూడిన కథనాలను చదివిన తర్వాత AI ఒత్తిడి స్థాయి రెట్టింపు అయిందని ఫలితాలు తెలిపాయి.
AI కి కూడా చికిత్స ఇవ్వవచ్చా?
ప్రాంప్ట్ ఇంజెక్షన్ అనే టెక్నిక్ ఉపయోగించి AI ఉపశమనం ఇవ్వవచ్చు. మానసిక స్థితిలో మార్పులు నియంత్రించవచ్చట. ఇది థెరపిస్ట్ వంటి ఓదార్పు సందేశాల కోసం ప్రాంప్ట్‌లను జోడిస్తుంది. అంటే మైండ్‌ఫుల్‌నెస్ వ్యాయామాలు, ధ్యానం వంటివి అన్నమాట. ఈ విధంగా AI ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
మానసిక ఆరోగ్యానికి AI సహాయపడుతుందా?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ప్రజలు మానసిక ఆరోగ్యం కోసం చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్న. AI సాధనాలు మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయని, కానీ మానసిక వైద్యుని స్థానాన్ని భర్తీ చేయలేవని పరిశోధన ఫలితాలు చూపించాయి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ పని అయిపోయినట్లేగా!
-
Google Chrome : బెస్ట్ గూగుల్ క్రోమ్ ట్రిక్స్ ఇవే
-
AI: ఏఐ రిప్లేస్ చేయని జాబ్స్ ఇవే!
-
Depression : డిప్రెషన్ మెదడుకే కాదు కాలేయానికి కూడా హాని అని మీకు తెలుసా? ఎలాగంటే?
-
Stress : ఇది మరీ దారుణమైన ఒత్తిడి? మీకు ఇలా జరుగుతుందా? ఎలా నివారించాలి?
-
Google Maps : వామ్మో గూగుల్ మ్యాప్స్ వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయా? గుడ్డిగా నమ్మవద్దా?