Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?

Heart Health : ఈ రోజుల్లో మన జీవితాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నా, మన జీవనశైలి మాత్రం ఆరోగ్యాన్ని పక్కకు నెట్టేస్తోంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి కొన్ని ఆధునిక అలవాట్లు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ అలవాట్లను వెంటనే మార్చుకోకపోతే యువకుల్లో కూడా గుండెపోటు, ఇతర గుండె జబ్బుల ముప్పు చాలా వేగంగా పెరుగుతుందని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు ఉన్నట్టుండి రావు. అవి మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల, నిర్లక్ష్యం వల్ల నెమ్మదిగా వస్తాయి. మనం కొన్ని మార్పులు చేసుకుంటే.. అంటే రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం, సరిపడా నిద్రపోవడం అంటివి చేస్తే గుండెను చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
గంటల కొద్దీ ఒకే చోట కూర్చోవడం
లాప్‌టాప్‌లు, మొబైల్స్, టీవీల ముందు గంటల కొద్దీ కూర్చోవడం ఈ రోజుల్లో సాధారణ అలవాటుగా మారింది. ఆఫీస్ పనులు, సోషల్ మీడియా – అన్నీ స్క్రీన్ పైనే జరుగుతున్నాయి. అయితే, శరీరం ఎక్కువసేపు ఒకే చోట కదలకుండా ఉన్నప్పుడు, రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. దీనివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. ఈ రెండు అంశాలు గుండె జబ్బులకు ప్రధాన కారణాలు.
Read Also:Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
ప్రాసెస్డ్ ఫుడ్ తినడం
ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్, డబ్బాలో వచ్చే ఆహారం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు ఇవన్నీ ఆధునిక ఆహారం పేరుతో మన శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్, ఉప్పు, షుగర్ లెవల్స్ పెంచుతున్నాయి. ఇలాంటి ఆహార పదార్థాలు శరీరంలో మంటను కలిగిస్తాయి, కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా రోజూ బయట తినే యువత ఇప్పుడు జాగ్రత్త పడాలి.
నిద్ర లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం
సరిపడా నిద్రపోకపోవడం లేదా అర్థరాత్రి వరకు మేల్కోవడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. కానీ శరీరానికి తగినంత నిద్ర లభించనప్పుడు, ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును, జీవక్రియను దెబ్బతీస్తుంది. నిరంతరం ఒత్తిడిలో ఉండటం, నిద్రలేమి వల్ల గుండె కొట్టుకునే వేగం అస్తవ్యస్తం కావచ్చు, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఈ రోజుల్లో 30 ఏళ్ల తర్వాత నుంచే గుండె సంబంధిత సమస్యలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం పైన చెప్పిన ఆధునిక అలవాట్లే. చాలా మంది వీటిని ఒక స్టైల్ అనుకుని పాటిస్తున్నారు. సమయానికి ఈ అలవాట్లలో మార్పులు చేసుకోకపోతే, భవిష్యత్తులో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారవచ్చు.
గుండెను ఎలా కాపాడుకోవాలి?
* రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి.
* ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి బదులుగా ఇంట్లో వండిన సమతుల్యమైన ఆహారం తినాలి.
* రోజుకు 7-8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.
* మొబైల్, టీవీ చూసే సమయాన్ని తగ్గించాలి.
* ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగాను మీ దినచర్యలో చేర్చుకోవాలి.
-
Mental Stress : యువతకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. దేశ భవిష్యత్తుకు ప్రమాదమా?
-
Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
-
premature aging in men : అబ్బాయిలు ఈ మిస్టేక్స్ చేశారో.. వృద్ధాప్యం గ్యారెంటీ
-
Daily Bread : రోజూ బ్రెడ్ తింటున్నారా.. ఈ మెదడు వ్యాధి రావచ్చట.. తస్మాత్ జాగ్రత్త
-
Fresh Coconut : పచ్చి కొబ్బరిని పక్కన పెట్టొద్దు.. అపోహలు వీడండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
-
Blood Pressure: ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. మీకు రక్తపోటు అధికం కావడం పక్కా