Tirupati : సెలవు పెట్టకుండా రూ.2000వేలతోనే తిరుపతి టూర్.. ఎలా స్టార్ట్ చేయాలి? ఎప్పుడు తిరిగి రావాలి?

Tirupati : తిరుమల శ్రీవారి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎప్పుడూ ఆరాటపడుతుంటారు. అయితే, ఉద్యోగం చేసేవాళ్ళకి డ్యూటీ టైమింగ్స్, ఆఫీసుల్లో సెలవులు దొరకకపోవడంతో చాలా మంది ప్లాన్లు క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా, కేవలం వీకెండ్లోనే తిరుమల యాత్ర పూర్తి చేసుకొని, సోమవారం డ్యూటీకి వెళ్ళిపోయే ఒక సూపర్ ప్లాన్ గురించి తెలుసకుందాం. ఇది తక్కువ ఖర్చులో, సులభంగా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.
శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరాలి. సుమారు రాత్రి 9:45 గంటల నుండి 10:38 గంటల మధ్య హైదరాబాద్‌లో అందుబాటులో ఉండే రైళ్లను సెలక్ట్ చేసుకోవచ్చు. శనివారం ఉదయం 11 గంట కల్లా తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటారు.
తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం ఉంటుంది. అక్కడ ఫ్రెష్ అవ్వడానికి, రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. భోజన సౌకర్యం కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. దర్శనం టోకెన్ల కోసం కూడా అక్కడే విచారించవచ్చు. సాధారణంగా టీటీడీ తమ వెబ్సైట్ ద్వారా ముందుగానే టోకెన్లు ఇస్తుంది.
Read Also:Vaibhav Suryavanshi : 52బంతుల్లోనే సెంచరీ.. 13ఫోర్లు, 10 సిక్సులతో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం
దగ్గర దర్శనం టోకెన్లు ఉంటే, వాటిలో ఉన్న సమయం ప్రకారం ఆదివారం రోజు స్వామివారిని దర్శనం చేసుకొని, అదే రాత్రి హైదరాబాద్‌కు తిరిగి రావొచ్చు. ఒకవేళ మీకు ముందుగా దర్శనం టోకెన్లు దొరక్కపోతే, శనివారం సాయంత్రానికి దర్శనం లైన్లో నిలబడితే, ఆదివారం మధ్యాహ్నానికి దర్శనం పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ సమయం పట్టినా, సెలవు తీసుకోకుండా దర్శనం చేసుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి.
ఈ మొత్తం యాత్రకు రూ. 2,000 కన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు. ఇందులో రైలు టికెట్లు, బస, భోజనం, తిరుమలకు బస్ ఛార్జీలు అన్నీ కలిపి ఉంటాయి. తక్కువ బడ్జెట్లో తిరుపతి దర్శనం పూర్తి చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ ప్లాన్‌తో శ్రీవారి దర్శనం చేసుకున్న ఆనందంతో సోమవారం ఉదయం మీరు మళ్ళీ మీ ఆఫీస్ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు.
ఈ ప్లాన్ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండి, సెలవులు లేకుండా తిరుపతి వెళ్లాలనుకునే ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పక్కా ప్లానుతో తక్కువ ఖర్చుతో శ్రీవారి దర్శనం చేసుకొని రావడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
Read Also:Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?