Vaibhav Suryavanshi : 52బంతుల్లోనే సెంచరీ.. 13ఫోర్లు, 10 సిక్సులతో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం

Vaibhav Suryavanshi : క్రికెట్ ప్రపంచంలోకి ఒక కొత్త సంచలనం అడుగు పెట్టింది. కేవలం 14 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తూ, ఏకంగా ఒక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న అండర్-19 వన్డే సిరీస్‌లో, వైభవ్ ఊహించని విధంగా 52 బంతుల్లోనే సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మెరుపు సెంచరీ, యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైనది కావడం విశేషం. అంతేకాకుండా పాకిస్తాన్ ఆటగాడి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.
Read Also:Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో అండర్-19 వన్డేలో వైభవ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ యువ భారతీయ ఆటగాడు కేవలం 52 బంతుల్లోనే శతకం బాదాడు. ఇది యువ క్రికెటర్ల విభాగంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. వైభవ్ సూర్యవంశీ ఈ సెంచరీతో ఒక గొప్ప రికార్డును నెలకొల్పాడు. గతంలో పాకిస్తాన్ ఆటగాడు కామ్రాన్ గులాం 53 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. వైభవ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. అంతేకాదు, ఈ యువ ఆటగాడు 78 బంతుల్లో 143 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయంటే అతని బ్యాటింగ్ ఎంత దూకుడుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వైభవ్ అండర్-19 స్థాయిలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Read Also:Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?
VAIBHAV SURYAVANSHI – FASTEST HUNDRED IN YOUTH ODI HISTORY…!!! 🇮🇳🥶 pic.twitter.com/ROtiDH6NZj
— Johns. (@CricCrazyJohns) July 5, 2025
వైభవ్ సూర్యవంశీ తో పాటు, విహాన్ మల్హోత్రా కూడా ఈ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. విహాన్ 121 బంతుల్లో 129 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. వైభవ్, విహాన్ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్ వల్ల భారత్ ఈ మ్యాచ్‌లో చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. భారత్ 43 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. అండర్-19 భారత జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ కుమార్, హర్వంశ్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టారు. అభిజ్ఞాన్ కుందూ 33 బంతుల్లో 23 పరుగులు చేశాడు. కానీ వైభవ్, విహాన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ల వల్ల భారత్ 300 పరుగులకు పైగా భారీ స్కోరును సాధించింది.
-
Yashasvi Jaiswal : రెండు సిక్స్ లు కొడితే చాలు.. ఆ రికార్డు బద్ధలు కొట్టనున్న యశస్వి జైస్వాల్
-
Vaibhav Suryavanshi : గిల్, పంత్ బాటలో వైభవ్ సూర్యవంశీ.. ఇక ఇంగ్లాండ్ లోనూ మెరుపులు
-
IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయం.. వైభవ్ సూర్యవంశీ రికార్డును సేవ్ చేసిన క్లాసెన్!
-
Vaibhav Suryavanshi: క్రికెట్లో హిట్.. చదువులో ఫట్.. బోర్డ్ పరీక్షలో ఫెయిల్ అయిన వైభవ్ సూర్యవంశీ
-
IPL: ఐపీఎల్లో మీనాక్షికి ఇష్టమైన జట్టు ఇదే
-
Test Matches: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!