Vaibhav Suryavanshi: క్రికెట్లో హిట్.. చదువులో ఫట్.. బోర్డ్ పరీక్షలో ఫెయిల్ అయిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi వైభవ్ సూర్యవంశీ 10వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడంటూ వస్తున్న వార్త కేవలం ఒక ఫన్నీ ట్వీట్ మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు.

Vaibhav Suryavanshi: దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడుతున్న ఈ సమయంలో ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, క్రికెట్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడట. ఆటల్లో అదరగొట్టిన ఈ కుర్రాడు చదువులో మాత్రం వెనుకబడిపోయాడని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
వైరల్ అవుతున్న ఫెయిల్ వార్తల్లో వాస్తవం ఎంత?
వైభవ్ సూర్యవంశీ బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. అవును, వైభవ్ సూర్యవంశీ అసలు బోర్డు పరీక్షకు హాజరు కాలేదు. మరి అతను పాస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యాడా అనే ప్రశ్న ఎలా వస్తుంది? అసలు విషయం ఏమిటంటే, ఈ వార్త ఒక సెటైర్!
వైభవ్ సూర్యవంశీ 10వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడంటూ వస్తున్న వార్త కేవలం ఒక ఫన్నీ ట్వీట్ మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు. ఆ వార్తలో ఏమని ఉందంటే, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ కావడంతో, అతని ఆన్సర్ షీట్‌ను డీఆర్‌ఎస్ స్టైల్‌లో రివ్యూ చేయాలని బీసీసీఐ కోరిందట!.ఇది చదివితే ఎవరికైనా నవ్వొస్తుంది కదా!
ఇక అసలు విషయానికి వస్తే, వైభవ్ సూర్యవంశీ ఇంకా 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కాదు. అతను ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. అంటే అతని బోర్డు పరీక్షలకు ఇంకా చాలా సమయం ఉంది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 సిక్సర్లు బాదాడు.