IPL: ఐపీఎల్‌లో మీనాక్షికి ఇష్టమైన జట్టు ఇదే
టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అలరించింది. ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

IPL: టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అలరించింది. ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం మీనాక్షి చేతులో ఎక్కువ సినిమాలు ఉన్నాయి. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం హిట్ కావడంతో వరుస సినిమాలు తన చేతిలో ఉన్నాయి. అయితే మీనాక్షి ఐపీఎల్ గురించి మాట్లాడింది. ఐపీఎల్‌లో తనకి ప్రత్యేకంగా ఏ జట్టు ఇష్టం లేదట. కాకపోతే ఎంఎస్ ధోనీ అంటే పిచ్చి. ధోనీ ఏ టీమ్‌లో ఉంటే అదే తన ఫేవరెట్ జట్టు అని చెబుతోంది. నిజానికి ధోనీ వల్లే క్రికెట్ చూస్తున్నట్లు తెలిపింది. క్రికెట్ మీద ఆసక్తి కూడా తన వల్లే పెరిగిందని అంటోంది.
Read Also: టాటా, మహీంద్రా నుంచి సంచలనాలు.. మార్కెట్లో దుమ్ములేపనున్న కార్లు ఇవే
పంజాబీ బ్యూటీ అయిన మీనాక్షి చౌదరి ఒకప్పటి మిస్ ఇండియా రన్నరప్. గ్లామర్ ప్రపంచంలోనే కాదు, విద్యాభ్యాసం, క్రీడా రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. వైద్య విద్యలో డాక్టర్ డిగ్రీ పూర్తిచేసిన ఆమె, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలలోనూ రాణించింది. ఆమె సౌందర్యం, ఆత్మవిశ్వాసం యువతలోకి ఆమెను ఫేవరెట్ స్టార్‌గా నిలబెట్టాయి. సినిమాల్లోకి ఫస్ట్ బాలీవుడ్ మూవీ ద్వారా మీనాక్షి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2020లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్‌కి ఎంటర్ అయ్యింది. ఆ తర్వాత “హిట్: ది సెకండ్ కేస్” సినిమాతో కెరీర్‌లో బిగ్ బ్రేక్ దక్కించుకుంది. కోలీవుడ్‌లో విజయ్ ఆంటోనితో “కొలై”, విజయ్ తలపతితో “గోట్”, దుల్కర్ సల్మాన్‌తో “లక్కీ భాస్కర్” వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీలో కూడా నటించింది. కాకపోతే ఈ సినిమాలో మీనాక్షి పాత్రకు పెద్దగా బలం లేదు. ఇక బాలీవుడ్‌లో “స్త్రీ”, “మిమీ” వంటి హిట్స్ ఇచ్చిన దినేశ్ విజయన్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో కూడా కథానాయికగా ఎంపికైంది. వరుస సినిమాలు చేస్తూ మీనాక్షి చౌదరి హిట్‌లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ జాబితాలో కూడా చేరుతోంది. ఇప్పుడు ఏ సినిమాలో చూస్తున్న మీనాక్షి చౌదరి కనిపిస్తోంది.
Read Also: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
మీనాక్షి గోట్, లక్కీ భాస్కర్, ఆ తర్వాత పండగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వరుస హిట్‌లు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం అయితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. విక్టరీ వెంకటేష్ సరసన మీనాక్షితో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా నటించింది. ఈ మూవీలో మీనాక్షి పాత్రకు స్కోప్ ఉంది. తన నటనతో మరోసారి ఫ్యాన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాలో కూడా మీనాక్షి యాక్టింగ్‌కు ఫిదా అయ్యి.. మూవీస్ ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి బిజీ బిజీగా ఉంటోంది.
-
Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!
-
Meta: మేటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా.. ఫీచర్లు అయితే అదుర్స్
-
Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది
-
Test Matches: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!
-
Dry Coconut: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే