Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు

Allu Arjun : ప్రతేడాది నార్త్ అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగే తానా (TANA) వేడుకలు ఈసారి కూడా చాలా గ్రాండ్‌గా జరిగాయి. అమెరికాలో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్లు సమంత, శ్రీలీల, దర్శకుడు సుకుమార్ అలాగే తెలుగు సినీ పరిశ్రమకు దిగ్గజ దర్శకుడైన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు వంటి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే కొన్ని ముఖ్యమైన అవార్డులను కూడా సినీ ప్రముఖులకు అందించారు. ఆ తర్వాత సినీ ప్రముఖులందరూ తమ అభిమానులను ఉద్దేశించి ప్రసంగాలు చేశారు.
అయితే, ఈ ప్రసంగాలన్నింటిలో ముఖ్యంగా రాఘవేంద్ర రావు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదాస్పదంగా మారాయి. ఈ మాటలు అల్లు అర్జున్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. దీంతో నెట్టింట ఈ విషయంపై పెద్ద రచ్చే జరుగుతోంది. అసలు ఆయన ఏం మాట్లాడారు, దానిపై వివాదం ఎందుకు మొదలైంది, అల్లు అర్జున్ స్టార్‌డమ్ పై ఎలాంటి చర్చ నడుస్తోంది వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
తానా వేదికపై రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ వేదికపై ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దర్శకుడిగా నాకు 20ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నేను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇద్దరూ ఇక్కడే ఉన్నారు” అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ముఖ్యంగా సుకుమార్ గురించి చెప్పాలి. ఆయనకు నాకు ఒక కామన్ పోలిక ఉంది. అది ఏమిటని అనుకుంటున్నారు గడ్డం!” అని సరదాగా చెబుతూ నవ్వించారు.
Read Also:IND vs ENG : ఇంగ్లండ్ ముందు 600+ టార్గెట్.. ఇండియా గెలిచేనా?.. చరిత్ర ఏం చెబుతుందంటే ?
'#Sukumar, నేను అడవి రాముడులో అడవిని నమ్ముకున్నాను star director అయ్యాను, నువ్వు #Pushpa లో అడవిని నమ్ముకున్నావ్ star director అయ్యావ్, ఆయన్ని star hero చేశావ్!'
– #RaghavendraRao at #NATS2025 pic.twitter.com/CJ8T8Llpn9
— Gulte (@GulteOfficial) July 6, 2025
అనంతరం సీరియస్‌గా మాట్లాడుతూ.. “మరో పోలిక ఏమిటంటే.. నా సినిమా అడవి రాముడులో నేను అడవిని నమ్ముకున్నాను, దానితో నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను. అదే విధంగా నువ్వు (సుకుమార్) కూడా పుష్ప సినిమాని నమ్ముకున్నావ్ దానితో నువ్వు స్టార్ డైరెక్టర్ అయ్యావ్ అల్లు అర్జున్‌ని స్టార్ హీరోని చేశావ్. అలానే మా శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించి పాన్ ఇండియా స్టార్‌ని చేశావ్. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్లందరికీ నా విషెష్. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మన తెలుగోళ్లు అమెరికాలో అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు” అంటూ ప్రసంగాన్ని ముగించారు.
రాఘవేంద్ర రావు ప్రసంగించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ముఖ్యంగా, “అల్లు అర్జున్‌ని సుకుమార్ పుష్పతో స్టార్ హీరోని చేశాడు అనే రాఘవేంద్ర రావు వ్యాఖ్యపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను చూపించి నెటిజన్లు అల్లు అర్జున్‌ని వేరే లెవెల్‌లో ట్రోల్ చేస్తున్నారు. రాఘవేంద్ర రావు చెప్పిన మాటల ప్రకారం, అల్లు అర్జున్ నిజంగానే పుష్ప సినిమాతోనే స్టార్ హీరో అయ్యాడని, అంతకు ముందు కేవలం ఒక మామూలు మీడియం రేంజ్ హీరో మాత్రమే అని పరోక్షంగా చెప్పారని అంటున్నారు.
Read Also:Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?
సినిమా మార్కెట్ పరంగా చూసుకుంటే ఓపెనింగ్స్ విషయంలో అల్లు అర్జున్ గతంలో పెద్ద స్టార్ హీరోలకు చాలా దూరంగా ఉండేవాడు అనేది ఒక వాస్తవం. ‘సరైనోడు’ సినిమా వరకు కూడా అల్లు అర్జున్ సినిమాలకు మొదటి రోజు పెద్దగా ఓపెనింగ్స్ వచ్చేవి కావు. సినిమాకు మంచి టాక్ వస్తే తప్ప లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు వచ్చేవి కానీ, ఓపెనింగ్స్‌లో మాత్రం తక్కువగానే ఉండేవి. పుష్ప: ది రైజ్ సినిమా తర్వాత, ముఖ్యంగా పుష్ప 2: ది రూల్ తోనే అల్లు అర్జున్ కెరీర్‌లో మొట్టమొదటి సారిగా భారీ ఓపెనింగ్ రికార్డులను అందుకున్నాడు. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు రాఘవేంద్ర రావు మాటలను బట్టి ఇలా ట్రోల్ చేస్తున్నారని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ