Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?

Harihara Veeramallu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. అందులో ఒకటి చాలా కాలంగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు. రెండు నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రీసెంటుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందింది. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎంత వసూలు చేస్తే నిర్మాతకు లాభాలు వస్తాయి అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే స్టార్ హీరోలందరూ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లు సినిమా బడ్జెట్ సుమారు రూ.250 కోట్లు అని తెలుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా నిర్మాత లాభాల్లోకి రావాలంటే రూ.250 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించాలి అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. కానీ, ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం రూ.150 కోట్లకు మించి వసూలు చేయడం కష్టం అని చెబుతున్నారు. అంటే, ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చి, కనీసం రూ.250 కోట్లకు పైగా వసూలు చేస్తేనే నిర్మాత సేఫ్ అవుతారు. లేకపోతే భారీ నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది.
Read Also: Tammudu movie full review: తమ్ముడు మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
‘హరిహర వీరమల్లు’ సినిమాతో పవన్ కళ్యాణ్ తొలిసారిగా పాన్ ఇండియా లెవల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక తిరుగుబాటు యోధుడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కీలక విలన్‌గా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
మొత్తంగా పాన్ ఇండియా మార్కెట్లో పవన్ కళ్యాణ్ లెవల్లో ఏంటనేది ఈ సినిమాతో తేలనుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుంది అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జులై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Read Also: Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Pawan Kalyan : పాకీజాపై పవన్ పెద్ద మనసు.. ఏం చేశాడంటే?
-
Hari Hara Veera Mallu : ఆ ట్రైలర్ వస్తే థియేటర్లు బద్దలే.. ‘పీకే’ చివరి డైలాగ్ మామూలుగా ఉండదంట!
-
Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ
-
Kubera Movie : ‘కుబేర’కు రూ.100 కోట్లు వచ్చినా, ధనుష్‌కు షాకే!
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్