Tammudu movie full review: తమ్ముడు మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Tammudu movie full review: టాలీవుడ్ హీరో నితిన్ ఎప్పటి నుంచో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు. కొత్తగా వచ్చిన హీరోలకి వచ్చిన గుర్తింపు నితిన్‌కి పెద్దగా రాలేదు. వరుస సినిమాలు చేస్తున్నా కూడా పెద్ద హిట్ అయితే సాధించలేదు. ఏదైనా ఒక సినిమా హిట్ అయితే మళ్లీ వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఎలాగైనా సినిమా హిట్ కొట్టాలని తమ్ముడు సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా హిట్ అయ్యిందా? నితిన్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా? లేకపోతే మళ్లీ ఫ్లాప్ అయ్యిందా? అనేది ఫుల్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అక్కకు ఇచ్చిన మాట కోసం ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న కొంతమందిని సేవ్ చేయడానికి నితిన్ ఆ ఏరియా కు వెళ్లి అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొని ఆ ప్రాంత ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడు. మరి ఈ క్రమంలో ఆయన వాళ్ళ అక్క మాటను నిలబెట్టాడా? ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్లు పడుతున్న ఇబ్బందులు ఏంటి వాళ్లకు ఆయనకు మధ్య సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ
దర్శకుడు శ్రీరామ్ వేణు సినిమాను సెంటిమెంట్‌తో తీశాడు. అక్క, తమ్ముడు సెంటిమెంట్‌లో తీసినా కూడా పెద్దగా ఎమోషనల్ పండలేదని టాక్ వినిపిస్తోంది. సినిమా స్టోరీ బాగానే ఉన్నా కూడా స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు ఇంకా బాగా రాసి ఉంటే బాగుండేది. కథని సరిగ్గా స్క్రీన్ ప్లే చేసే విషయంలో దర్శకుడు అయితే విఫలమయ్యాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్ అంతా కూడా కాస్త స్లోగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌ను పండించలేవు. కథ రాసుకున్నప్పుడు బాగానే ఉన్నా కూడా తెరపైకి వచ్చిన తర్వాత సరిగ్గా లేదని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే బాగుండేదని తెలుస్తోంది. అయితే సినిమా ఎమోషనల్‌గా అసలు కనెక్ట్ కాదని టాక్ వినిపిస్తోంది. కొన్ని అనవసరమైన సీన్లు ఉన్నాయని, వాటిని కట్ చేసి ఉండే బాగుండేదని అంటున్నారు. అయితే సినిమాలో సెకండ్ ఆఫ్‌లో కొన్ని యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా కట్టి పడేస్తాయి. అలాగే నిర్మాణ విలువలు కూడా సాధారణంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ బాగానే ఉంది. కొన్ని సన్నివేశాల్లో బాగానే ఉందని అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌కి, యాక్షన్ సన్నివేశాలకు మ్యూజిక్ సరిపోయిందని అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫామెన్స్
నటీనటుల పర్ఫామెన్స్ చూస్తే నితిన్ యాక్టింగ్ సూపర్‌గా ఉంది. కాకపోతే ఎమోషనల్ సీన్లు అయితే ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాలేదు. యాక్షన్ సీన్స్‌లో అయితే నితిన్ అదరగొట్టాడు. ఇక సప్తమి గౌడ తన పాత్రకు న్యాయం చేసింది. ఈమె పాత్రకు సినిమాలో స్కోప్ కూడా ఉంది. అలాగే లయ, వర్ష బొల్లమ్మ కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా నటించారు. కాకపోతే లయ పాత్రకు తక్కువ స్క్రీన్ సమయం ఉంది. కానీ స్ట్రాంగ్ పాత్ర అని చెప్పవచ్చు. ఇందులో విలన్‌గా నటించిన సురబ్ సత్యదేవ్ నటన అయితే అదిరిపోయింది. విలన్ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ బాగుంది. అలాగే సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అయ్యింది. విజువల్స్ బాగున్నాయి. కానీ ఇంకా అద్భుతంగా అయితే లేవు. ఎడిటింగ్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు సినిమాలో కట్ చేసి ఉంటే బాగుండేదని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
యాక్షన్ సీన్లు
నితిన్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
రేటింగ్- 2.25/5
-
Thammudu Movie Twitter Review: ‘తమ్ముడు’ ట్విట్టర్ రివ్యూ..!
-
Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?
-
Nithin Thammudu Movie Trailer: నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. వీడియోపై ఓ లుక్కేయండి
-
Balayya Rejected Laya: షూటింగ్ మొదటి రోజే లయను వద్దు అనేసిన బాలయ్య.. విషయాలు బయటపెట్టిన లయ
-
Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!
-
Venky Atluri: డైరెక్టర్ వెంకీ అట్లూరి టాలీవుడ్ హీరోలతో సినిమాలు ఎందుకు చేయరు.. దీనికి గల కారణం ఏంటి?