Nithin Thammudu Movie Trailer: నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. వీడియోపై ఓ లుక్కేయండి

Nithin Thammudu Movie Trailer: హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబోలో వస్తున్న ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ‘తమ్ముడు’ ట్రైలర్ చూస్తుంటే.. అక్కా, తమ్ముళ్ల అనుబంధం చుట్టూ అల్లుకున్న ఒక ఎమోషనల్ కథ అని తెలుస్తోంది. హీరో నితిన్, నటి లయ అక్కా తమ్ముళ్లుగా నటించారు. ఈ మూవీతో లయ మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నితిన్ తన అక్కకి ఇచ్చిన మాటను నిలబెట్టే తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఒక మాట కోసం ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. అయితే ట్రైలర్ అయితే అదిరిపోయింది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ బట్టి, కథలో ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ అన్ని ఉన్నాయి. వీటితో పాటు కొన్ని డైలాగ్‌లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో నితిన్ “మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికి ఉన్నట్టే లెక్క” అనే డైలాగ్ చెబుతాడు. మూవీ మొత్తానికి ఈ డైలాగ్ అయితే అదిరిపోయింది. అక్క మాటకు, బంధాలకు నితిన్ ఎంత విలువ ఇస్తాడనే ట్రైలర్‌లో చూడవచ్చు.
ఇది కూడా చూడండి: Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?
తమ్ముడు మూవీలో లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ వంటి నటీమణులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లయ అక్క పాత్రలో కనిపించగా, ఇతర హీరోయిన్స్ పాత్రలు కథలో ఎలాంటి మలుపులు తెస్తాయో చూడాలి. ట్రైలర్‌లో వీరి పాత్రలను అంతగా రివిల్ చేయలేదు. దర్శకుడు శ్రీరామ్ వేణు ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘వకీల్ సాబ్’ సినిమాలు తీశారు. ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో ‘తమ్ముడు’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ట్రైలర్‌లోని అన్ని కూడా బాగున్నాయి. నితిన్ యాక్టింగ్ నుంచి కంప్లీట్ అదిరిపోయాయని చెప్పవచ్చు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, పదునైన సంభాషణలు అన్నీ కలిసి సినిమాపై అంచనాలను ఇంకా పెంచాయి. కేవలం ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, ఒక కుటుంబ కథా చిత్రం అని, ముఖ్యంగా అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ కెరీర్‌లో ‘తమ్ముడు’ ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం, నితిన్ నటన, ఆకట్టుకునే డైలాగ్స్, బలమైన ఎమోషనల్ కథాంశం ఈ సినిమాకు సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే జులై 4న సినిమా విడుదల కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Tammudu movie full review: తమ్ముడు మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
-
Thammudu Movie Twitter Review: ‘తమ్ముడు’ ట్విట్టర్ రివ్యూ..!
-
Movie piracy: మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీలకు సినిమాలు అమ్మింది ఇతడే.. వేల కోట్ల నష్టం తెప్పించాడు
-
Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?
-
Sapthami Gowda : నితిన్ సినిమాలో కాంతారా బ్యూటీ ఉండేది అంత సేపేనా.. ఫస్ట్ సినిమానే షాక్