Movie piracy: మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీలకు సినిమాలు అమ్మింది ఇతడే.. వేల కోట్ల నష్టం తెప్పించాడు

Movie piracy: ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు.. వెంటనే పైరసీ అవుతుంది. బప్పం టీవీ, మూవీ రూల్జ్‌లో సినిమా వచ్చేస్తుంది. చాలా మంది ఈ మధ్య కాలంలో సినిమాలకు వెళ్లే సమయం లేకపోవడం, అలాగే టికెట్ డబ్బులు లేక పైరసీలోనే ఎక్కువగా చూస్తున్నారు. దీనివల్ల చాలా సినిమాలకు కోట్ల నష్టం వస్తోంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రోజు చాలామంది పైరసీ సినిమా చూస్తారు. దీంతో థియేటర్లో ఎవరూ కూడా సినిమా చూడరు. అందరూ మొబైల్‌లో చూస్తున్నారు. అయితే ఇలా సినిమాను పైరసీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి రిలీజ్ అయిన అన్ని సినిమాలను పైరస్ చేస్తున్నారు. ఏసీ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్న కిరణ్ 2019 నుంచి ఇప్పటి వరకు మొత్తం 65 సినిమాలు పైరసీ చేశాడు. పలు సైట్లకు ఒక్కో సినిమాను విక్రయించాడు. తమిళ సినిమాలకు కూడా విక్రయించాడు. ఒక్కో సినిమా ఖరీదు రూ.40వేల నుంచి రూ.80వేల వరకు ఉండేది. అయితే ఇదంతా కూడా క్రిప్టో కరెన్సీలో జరిగేది. ఇటీవల సింగిల్ మూవీని పైరసీ చేశాడు. ఈ ఒక్క వ్యక్తి వల్ల రూ.3700 కోట్ల నష్టం వాటిల్లింది.
ఇదిలా ఉండగా ఇటీవల కన్నప్ప మూవీ ని కూడా పైరసీ చేశారు. మొత్తం 30వేల అనధికారిక లింక్‌లను టీమ్ తొలగించింది. అయితే ఈ మూవీ పైరసీ కావడం ఎంతో బాధగా ఉందని మంచు విష్ణు ఇటీవల తెలిపారు. పైరసీ దొంగతనంతో సమానం. పిల్లలకు దొంగతనం చేయమని నేర్పించం.. ఇలా సినిమా చూడటం కూడా దొంగతనమే. దయచేసి వీటిని ప్రోత్సహించకండని కోరారు. కేవలం సరైన మార్గంలో మాత్రమే కన్నప్పను చూడండని తెలిపారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి షో నుంచే మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే పైరసీ వల్ల సినిమాకి భారీగా నష్టం వచ్చినట్లు మూవీ టీం తెలిపింది. అతన్ని అరెస్ట్ చేయడంతో ఇకపై సినిమా పైరసీ లు ఉండవు. ఇతను ఒక్కడే ఉన్నాడా ఇంకా ఎవరైనా పైరసీలు చేస్తున్నారని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?
-
Manchu Vishnu Post: దొంగతనంతో సమానం.. కన్నప్ప మూవీ పైరసీపై బాధ వ్యక్తం చేసిన విష్ణు!
-
Rashmika Mandanna: భయపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లుక్‌లో కొత్త ప్రాజెక్ట్!
-
Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!
-
Allu Arjun Next Movie AA23: త్రివిక్రమ్‌కి హ్యాండ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ డైరెక్టర్‌కి ఛాన్స్