Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Manchu Vishnu Post Kannappa Movie Piracy

Manchu Vishnu Post: దొంగతనంతో సమానం.. కన్నప్ప మూవీ పైరసీపై బాధ వ్యక్తం చేసిన విష్ణు!

Manchu Vishnu Post: దొంగతనంతో సమానం.. కన్నప్ప మూవీ పైరసీపై బాధ వ్యక్తం చేసిన విష్ణు!
  • Edited By: kusuma,
  • Updated on June 30, 2025 / 03:26 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Manchu Vishnu Post: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి షో నుంచే మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది. సినిమాలో మంచు విష్ణు యాక్టింగ్‌తో పాటు స్టోరీ అన్ని బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎక్కువ మంది ప్రముఖ నటులు నటించారు. అయితే మంచి హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ పైరసీకి గురవుతుందని విష్ణు సోషల్ మీడియా ద్వారా ఆవేదన చెందారు. మూవీ పైరసీకి ఎవరిని కూడా సపోర్ట్ చేయవద్దని కోరారు. కన్నప్ప మూవీ పైరసీకి గురైందని, ఇప్పటికే 30వేల అనధికారిక లింక్‌లను టీమ్ తొలగించినట్లు తెలిపారు. మూవీ ఇలా పైరసీ కావడం ఎంతో బాధగా ఉందన్నారు. పైరసీ దొంగతనంతో సమానం. పిల్లలకు దొంగతనం చేయమని నేర్పించం.. ఇలా సినిమా చూడటం కూడా దొంగతనమే. దయచేసి వీటిని ప్రోత్సహించకండని కోరారు. కేవలం సరైన మార్గంలో మాత్రమే కన్నప్పను చూడండని తెలిపారు.

Dear movie lovers,#Kannappa is under attack from piracy. Over 30,000 illegal links have already been taken down. This is heartbreaking.

Piracy is theft — plain and simple. We don’t teach our children to steal. Watching pirated content is no different.

Please don’t encourage…

— Vishnu Manchu (@iVishnuManchu) June 30, 2025

కన్నప్ప మూవీ స్టోరీ భక్త కన్నప్పది. దేవుడు లేడని, శివ లింగం కేవలం ఒక రాయి మాత్రమేనని చిన్నప్పటి నుంచి తిన్నడు (మంచు విష్ణు) నమ్ముతాడు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల మహా శివభక్తుడిగా తిన్నడు మారుతాడు. కొందరు వాయు లింగాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారి గూడెం వారిని తగలబెట్టాలని ప్రయత్నిస్తారు. అప్పుడు తిన్నడు వారిని కాపాడే ప్రయత్నంలో రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో శివుడి భక్తురాలు అయిన నెమలిరాణి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. అయితే అసలు ఎలా తిన్నడు శివ భక్తుడిగా మారుతాడు అనే నేపథ్యంలో సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది. అయితే మొదటి రెండు రోజులు కేవలం రూ.42 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్లను మూవీ టీం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వీకెండ్‌ను కలుపుకుని ఇంకా కలెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సండే సెలవు రోజు కావడంతో ఎక్కువగా బాగానే కలెక్షన్లు వచ్చి ఉంటాయని అంటున్నారు. మరి ఏదైనా కూడా మూవీ టీం అధికారికంగా కలెక్షన్లను ప్రకటిస్తే తెలుస్తుంది.

Read Also:Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి

Tag

  • Illegal
  • Kannappa movie
  • Manchu Vishnu Post
  • Piracy
Related News
  • Movie piracy: మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీలకు సినిమాలు అమ్మింది ఇతడే.. వేల కోట్ల నష్టం తెప్పించాడు

  • Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

  • Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ

  • Kannappa : వామ్మో.. గెస్ట్ పాత్రలకే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అన్ని కోట్లు తీసుకున్నారా

  • Kannappa : కన్నప్ప విడుదలకు ముందే క్రిటిక్స్, ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు

  • Mohan Babu : న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న మంచు మోహన్ బాబు విష్ణు.. అసలు నిజం వెలుగులోకి

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us