Kannappa : కన్నప్ప విడుదలకు ముందే క్రిటిక్స్, ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు

Kannappa : భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘కన్నప్ప’ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది . ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ కింగ్ అక్షయ్ కుమార్ వంటి అగ్రతారలు అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మోహన్ బాబు నిర్మించారు. పెద్ద ఎత్తున ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. అయితే, విడుదల కావడానికి కేవలం రెండు రోజుల ముందు, నిర్మాతలు సినిమా విమర్శకులకు, ట్రోలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 24 ఫ్రేమ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. ఈ సంస్థ ఒక సుదీర్ఘ ప్రకటనను రిలీజ్ చేసింది. ఆ ప్రకటనలో.. “మేము సినిమా విడుదల కోసం కావాల్సిన అన్ని అనుమతులు, లైసెన్స్‌లు తీసుకున్నాం. దానితో పాటు, ఢిల్లీ హైకోర్టు మంచు విష్ణు, మోహన్ బాబులకు ప్రచార హక్కుల కింద రక్షణ కల్పించింది. అలాగే, సినిమా కథ, ఇతర క్రియేటివిటీ విషయాలకు సంబంధించిన కాపీరైట్లను కూడా పొందాం. సినిమా విమర్శకులు ముందుగా సినిమాను చూడండి. సినిమా చేసిన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోండి. సినిమా గురించి గౌరవంగానే అభిప్రాయాలు చెప్పాలి. అంతేకానీ, సినిమా గురించి నిందించడం, తిట్టడం లేదా దురుద్దేశంతో కూడిన నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం వంటివి సహించం” అని విమర్శకులకు నిర్మాతలు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
Read Also : Telangana bonalu: తెలంగాణ బోనాల వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసా?
దీనితో పాటు.. “రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను మేము గౌరవిస్తాం. కానీ, దురుద్దేశంతో కూడిన దూషణలను సహించం. కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశం ప్రకారం.. ఏ క్రియేటివిటీ కళ మీద అయినా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయడం, తిట్టడం నేరం” అని కూడా తెలిపారు. అంతేకాకుండా, సినిమా చిత్రాలు, వీడియోలు, పూర్తి సినిమాను సోషల్ మీడియా లేదా ఏ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రదర్శించడాన్ని నిషేధించారు. అలా చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘కన్నప్ప’ సినిమా శివభక్తుడు కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కింది. సినిమాలో మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటించారు. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి వారు అతిథిపాత్రల్లో నటించారు. సినిమా హీరోయిన్గా ప్రీతి ముకుందన్ నటించింది. బ్రహ్మానందం, దేవరాజ్ మరికొందరు సీనియర్ నటీనటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు.
Read Also : Mahindra Scorpio-N : టాటా, ఎంజీలకు షాక్.. సరికొత్త సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న మహీంద్రా స్కార్పియో-ఎన్
-
Kannappa : వామ్మో.. గెస్ట్ పాత్రలకే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అన్ని కోట్లు తీసుకున్నారా
-
Mohan Babu : న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న మంచు మోహన్ బాబు విష్ణు.. అసలు నిజం వెలుగులోకి
-
Barkha Madan : గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసినిగా మారిన టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా ?
-
Mohan Babu : మంచు విష్ణు కోసం న్యూజిలాండ్ లో 7000ఎకరాలు కొన్న మోహన్ బాబు.. వీడియో వైరల్
-
The Raja Saab: ‘ది రాజా సాబ్’ ప్రభాస్ మూవీ సెట్స్ చూశారా.. ఎంత అద్భుతంగా ఉన్నాయో!
-
Prabhas : ఆ సినిమా తర్వాత ఏకంగా 6 వేల పెళ్లి ప్రపోజల్స్.. 45ఏళ్లలోనూ ఇంకా ఒంటరిగానే స్టార్ హీరో