Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!

Hari hara Veera mallu movie Trailer: ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘హరి హర వీర మల్లు’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. జూలై 24 తేదీన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో మూవీ టీం తాజాగా హరి హర వీర మల్లు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. పవన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. డైలాగ్‌లు అయితే ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచాయి. చాలా బాగా డైలాగ్‌లు అయితే వెరీ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో పవన్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటించింది. నిధి లుక్ అయితే అదిరిపోయింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ అయితే అదిరిపోయింది. అయితే ఇందులో ఓ వీరుడి కోసం పురుడు పోసుకుంటున్న సమయం ఇదే అనే వాయిత్‌తో ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ అన్ని కూడా సూపర్‌గా ఉన్నాయి. సినిమా అయితే తప్పకుండా అదిరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో విలన్ పాత్రలో బాబీ డియోల్ కనిపించారు. అలాగే అనుపమ్ ఖేర్, సత్యరాజ్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఎ. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల ఇలా వాయిదా పడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా కొన్నేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇందులో కొంత భాగాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించారు. కొన్ని కారణాల వల్ల అతను తప్పుకోవడంతో ఇక జ్యోతి కృష్ణ మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రాబోతుంది. ఇప్పుడు మొదటి పార్ట్ రిలీజ్ కాబోతుంది. రెండో పార్ట్ ఆ తర్వాత రానుంది. మొదటి పార్ట్ అనేది హరి హర వీర మల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో జూలై 24వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మాలయాళ భాషల్లో రానుంది. ఈ సినిమా నిజానికి జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా వీఎఫ్‌ఎక్స్ పూర్తిగా కావడంతో సినిమాను జూలై 24 వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా 2020లో షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, కరోనా మహమ్మారి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల వల్ల అనేక సార్లు షూటింగ్ ఆగిపోయింది. దీనివల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఫైనల్‌గా ఇప్పుుడు హరి హర వీర మల్లు థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఇక పవన్ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పుకోవచ్చు.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!
-
Kannappa : కన్నప్ప విడుదలకు ముందే క్రిటిక్స్, ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు
-
The Raja Saab Teaser: రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ: ప్రభాస్ కామెడీ చేస్తే కెవ్వు కేక అంతే..
-
Mad square trailer: లడ్డు గాని పెళ్లి ఆపేద్దాం.. నవ్వులు పూయిస్తున్న మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్
-
Hero Surya Movie : తెలుగు దర్శకుడితో సూర్య సినిమా.. హీరోయిన్స్ గా అల్లరించబోతున్న ఇద్దరు హాట్ బ్యూటీలు…
-
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ప్రోమో చూశారా.. పవన్‌తో అనసూయ స్పెషల్ సాంగ్.. అదరిపోయిందిగా..