Hero Surya Movie : తెలుగు దర్శకుడితో సూర్య సినిమా.. హీరోయిన్స్ గా అల్లరించబోతున్న ఇద్దరు హాట్ బ్యూటీలు…

Hero Surya Movie :
ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో సూర్య కూడా ఒకరు. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూర్య సినిమాలకు బాగా క్రేజ్ ఉంది. సూర్య ఇటీవలే కంగువ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ప్రస్తుతం సూర్య చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన అసలు పేరు శరవనన్ శివకుమార్. కానీ ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆయన పేరును సూర్యగా మార్చారు. చివరిగా సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. అభిమానులను అభిమానులను ఈ సినిమా నిరాశపరచడంతో ప్రస్తుతం అందరి దృష్టి సూర్య తర్వాతి సినిమా మీదనే ఉంది. ప్రస్తుతం సూర్య రెట్రో మరియు సూర్య 45 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెట్రో సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో సూర్యకు జోడిగా టాలీవుడ్ హాట్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. మే 1, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత సూర్య ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య రెండు పాత్రలలో కనిపించబోతున్నారు అని టాక్. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2024లో స్టార్ట్ అయ్యింది. హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత హీరో సూర్య వాడి వాసన సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ లోకి కూడా సూర్య ఎంట్రీ ఇస్తున్నారు అని తెలుస్తుంది. టాలీవుడ్ దర్శకుడు అయిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది.
సూర్య తో పాటు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు అని ఒక కొత్త న్యూస్ ప్రస్తుతం వినిపిస్తుంది. నటి భాగ్యశ్రీ మరియు నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ల గా కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్యతో సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్స్ బయటకు రానున్నాయి.
View this post on Instagram
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?