The Raja Saab Teaser: రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ: ప్రభాస్ కామెడీ చేస్తే కెవ్వు కేక అంతే..

The Raja Saab Teaser: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా టీజర్ విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ హారర్ జానర్‌లో రూపొందుతోంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం తాజాగా టీజర్ విడుదల చేసింది. ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్, ఎలివేషన్లు అయితే టీజర్‌లో అదిరిపోయాయి. ఈ టీజర్‌లో ప్రభాస్ మునుపటి వింటేజ్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన స్టైల్, మేనరిజమ్స్ ‘డార్లింగ్’ అభిమానులకు పాత ప్రభాస్‌ను గుర్తుచేస్తున్నట్లు టీజర్ ఉంది. టీజర్‌లోని హారర్ ఎలిమెంట్స్‌తో పాటు, ఫన్నీ డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మారుతి తన మార్క్ కామెడీ టైమింగ్‌ను హారర్ జోనర్‌లో భలేగా టీజర్ ఉంది. కామెడీ, హారర్ కలయికతో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా స్టోరీ, సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్ అన్ని కూడా అదిరిపోయాయని చెప్పవచ్చు.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన గత చిత్రాలలో చూపిన కామెడీ టచ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో కూడా ఉంటాయని టీజర్ ద్వారా తెలుస్తోంది. హారర్ ఎలివేషన్స్‌ను కూడా పకడ్బందీగా చూపించి, ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి మారుతి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ప్రభాస్ నుంచి పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ‘మిర్చి’, ‘డార్లింగ్’ లాంటి సినిమాల్లో ప్రభాస్ చూపిన ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాక్‌ను ఈ చిత్రం సీక్వెల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
‘ది రాజా సాబ్’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచీ దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో, మారుతి లాంటి కామెడీ స్పెషలిస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు ఇంకా ఎక్కువగా పెరిగాయి. అయితే ఈ మూవీలో నిధి అగర్వాల్, మాలవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!