Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!

Pan India Star Prabhas: టాలీవుడ్‌లో ప్రేక్షకులను అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో వెంకట్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కొన్ని రోజుల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు మరింత తీవ్రం కావడంతో హైదరాబాద్‌లో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. అయితే వెంకట్‌కు కిడ్నీలు మార్పిడి చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు తెలిపారు. కిడ్నీ మార్పిడి అంటే చాలా డబ్బుతో కూడుకున్నది. అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో సాయం చేయమని ఫిష్ వెంకట్ కుమార్తె, ఆయన భార్య ఎమోషనల్ అయ్యారు. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాష్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.
ఫిష్ వెంకట్‌కు తాను చికిత్స అందిస్తానని, ఆ ఖర్చును మొత్తం భరిస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభాస్ అసిస్టెంట్ ఫిష్ వెంకట్ కుమార్తెకు ఫోన్ చేసి చెప్పినట్లు ఆమె వెల్లడించారు. సర్జరీ ఎంత వరకు అయితే అంతా కూడా సాయం చేస్తామని తెలిపారట. వెంకట్ సర్జరీ కోసం ఇబ్బంది పడవద్దని, కిడ్నీ దొరికితే వెంటనే సర్జరీ చేయమని అండగా ప్రభాస్ నిలిచినట్లు తెలుస్తోంది. తన తండ్రికి సరిపడా కిడ్నీ అయితే ఇప్పటి వరకు దొరకలేదని వెంకట్ కుమార్తె తెలిపింది. ఆమెది, వాళ్ల అమ్మది కూడా వేరే బ్లడ్ గ్రూప్ అని తెలిపింది. అయితే వారి బంధువుల్లో కిడ్నీ సరిపోయినా కూడా వారు కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలానే వెంకట్ కిడ్నీ చికిత్స కోసం ఇంకా కిడ్నీ లభ్యం కాలేదు.
ఎన్నో సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ నటించాడు. కానీ ప్రస్తుతం కిడ్నీ సమస్యలు రావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు సినిమాలు నటించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఒకసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రెండు లక్షల రూపాయలు సాయం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వెంకట్ పరిస్థితి విషమించడంతో అతని భార్య, కూతురు సాయం కోరారు. వెంటనే ప్రభాస్ స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే కిడ్నీ దొరికిన వెంటనే వెంకట్‌కు సర్జరీ చేస్తారు. అయితే ప్రభాస్ సోషల్ మీడియాలో, బయట ప్రపంచంతో చాలా తక్కువగా ఉంటారు. కానీ ఎవరైనా సాయం కావాలని అడిగితే మాత్రం తప్పకుండా ముందుకు వస్తారు. ఇప్పుడు కూడా ప్రభాస్ సాయం చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ప్రభాస్ సాయం చేయడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇది మన ప్రభాస్ అంటే అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read: Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Prabhas : ప్రభాస్ వింటేజ్ లుక్స్ రీలోడెడ్.. ‘ఫౌజీ’ నుంచి వైరల్ అవుతున్న ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా!
-
Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
-
Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!
-
Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ
-
Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ
-
Kannappa : కన్నప్ప విడుదలకు ముందే క్రిటిక్స్, ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు