Fish Venkat Passes Away: ఫిష్ వెంకట్ కన్నుమూత
Fish Venkat Passes Away హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట్ ప్రాణాలు కోల్పోయారు.

Fish Venkat Passes Away: కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట్ ప్రాణాలు కోల్పోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్ ను ఇటీవల కుబుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ఫిస్ వెంకట్ అసలు పేరు వెంకటేశ్ మంగలంపల్లి.
ఆయన హైదరాబాద్ ముషీరాబాద్ మార్కెట్ లో చేపల వ్యాపారం చేసేవారు. దీంతో ఫిష్ వెంకట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఏరియాలో నివాసం ఉంటున్న వెంకట్, నటుడు శ్రీహరి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ ఆయనను ఆది సినిమాతో నటుడిగా పరిచయం చేశారు. ఈ సినిమాలో తొడ కొట్టు చిన్నా అనే డైలాగ్ ఫేమస్. వెంకట్ తన కెరీర్ 100 పైగా సినిమాల్లో నటించారు. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించారు.
-
The Paradise Interesting Update: ది ప్యారడైజ్ గురించి ఆసక్తికర అప్డెట్
-
Rajasaab Run Time: రాజాసాబ్ రన్ టైమ్ ఎంతంటే
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని