Model San Rachel: మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ సూసైడ్.. నల్లగా ఉన్నావని విమర్శలే కారణమా?

Model San Rachel: ప్రస్తుతం సినీ పరిశ్రమలో చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇతరులు అన్ని మాటలకు కొందరు బాధపడి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమించిన వ్యక్తి దక్కలేదని, మరికొందరు కాస్టింగ్ కౌచ్ ఇలా ఏదో ఒక కారణం మీద మంచి లైఫ్‌ను పోగొట్టుకుంటున్నారు. కెరీర్ మంచిగా వెళ్తుందని అనుకున్నప్పుడు వారి చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ ప్రముఖ మోడల్ కూడా ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలు, సమాజం అనే మాటలు ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. ఈ కారణంగానే నిద్ర మాత్రలు తినేసి ఆత్మహత్య చేసుకుంది. ఇంతకీ ఆ మోడల్ ఎవరు? అసలు ఏమైంది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? దీనికి గల పూర్తి కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రముఖ మోడల్ సాన్ రాచెల్ (25) పుదుచ్చేరికి చెందినది. ఈమె తీవ్ర మనస్తాపానికి చెంది ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. అయితే రాచెల్ గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో చికిత్స కూడా తీసుకుంటుంది. అయితే ఇటీవల పెద్ద మొత్తంలో రక్తపోటు మాత్రలు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాచెల్ ప్రముఖ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె నల్లగా ఉందని, బాగా విమర్శలు వచ్చాయి. మోడల్ అంటే చర్మ రంగు కూడా ఎక్కువగా ఉండాలని అనేవారట. ఈమె నల్లగా ఉండటంతో బాగా విమర్శలు వచ్చాయి. ఈ కారణంగానే రాచెల్ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. అయితే రాచెల్ పుదుచ్చేరిలోని కరమణి కుప్పంలో నివసించారు. ఈమె “బ్లాక్ బ్యూటీ” విభాగంలో “మిస్ వరల్డ్” టైటిల్ కూడా గెలిచారు. ఇక మిస్ డార్క్ క్వీన్ తమిళనాడును 2019లో సొంతం చేసుకున్నారు. అలాగే ఇదే ఏడాది మిస్ బెస్ట్ యాటిట్యూడ్ టైటిల్, ఆ తర్వాత మిస్ పాండిచ్చేరి వంటి టైటిల్స్ కూడా అందుకున్నారు. ఇవే కాకుండా పలు ఫ్యాషన్ షోలు, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. రాచెల్ ఇలా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే తన స్కిన్ కలర్ డస్కీగా ఉండటంతో చాలా మంది ఆమెను విమర్శించారని, ఈ బాధను తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
సాన్ రాచెల్ ఆత్మహత్య లేకపోతే హత్య అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈమె చావుకు తన భర్త, అత్త కారణం కాదని ఒక సూసైడ్ నోట్ కూడా రాసి చనిపోయారు. అయితే ఆమెకు పలు ఫ్యాషన్ షో వల్ల భారీ ఆర్థిక నష్టం జరిగినట్లు సమాచారం. దీనివల్ల తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. మరికొందరు కిడ్నీ సమస్యలు కూడా ఓ కారణమేనని అంటున్నారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, ఇతరులు అన్న మాటలు ఇలా అన్ని సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Kota Srinivasa Rao: శోక సంద్రంలో సినీ ఇండస్ట్రీ.. విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతి
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Kidney Issues: వీటిని మీరు డైలీ తీసుకుంటే.. మీ కిడ్నీలు సేఫ్
-
Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?
-
Eating Dal Night Time: వామ్మో.. రాత్రిపూట పప్పు తినడం ఇంత ప్రమాదమా!
-
Urine Hold Health Issue: మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకుంటే.. పిల్లలు పుట్టడం కష్టమేనా?