Urine Hold Health Issue: మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకుంటే.. పిల్లలు పుట్టడం కష్టమేనా?

Urine Hold Health Issue: చాలామంది కొన్నిసార్లు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు, పనిలో బిజీగా ఉన్నప్పుడు, వాష్ రూమ్‌కి వెళ్లడానికి బద్దకించి ఇలా చేస్తుంటారు. అయితే మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మన శరీరానికి తీవ్రమైన నష్టాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలతో పాటు గుండె, మెదడు, సంతాన సమస్యలు కూడా రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం, పానీయాల నుండి శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలను శరీరం బయటకు పంపేస్తుంది. ఈ వ్యర్థాలలో యూరిన్ కూడా ఒకటి. మూత్ర విసర్జన అనేది ఒక సహజమైన ప్రక్రియ. అయితే ఈ సహజమైన ప్రక్రియను ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల శరీరంపై చాలా ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. ఇదే కనుక జరుగుతుంటే మాత్రం కిడ్నీ సమస్యలే కాకుండా గుండెకు కూడా ప్రమాదమని, సంతాన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శరీరానికి తగినంత నీరు తాగుతూ ఉండాలి. నీళ్లు తాగడం వల్ల యూరిన్ వస్తుందని చాలామంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు. మరికొంతమంది పదే పదే వాష్ రూమ్‌కి వెళ్తే పక్కన ఉన్న వాళ్లు ఏమనుకుంటారో అని కూడా ఆలోచిస్తారు. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని శుభ్రం చేసి, వ్యర్థ పదార్థాలను యూరిన్ రూపంలో బయటకు పంపుతాయి. యూరిన్‌లో దాదాపు 95 శాతం నీరు, 2 శాతం యూరియా, కాల్షియం, సోడియం, పొటాషియం వంటివి ఉంటాయి. మీరు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే యూరిన్‌లో ఉండే యూరియా, కాల్షియం వంటివి మూత్రపిండాలలోనే పేరుకుపోయి చిన్న చిన్న రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. వీటినే మనం కిడ్నీలో రాళ్లు అంటాము.
కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసే ప్రక్రియ సరిగా జరగదు. కొన్నిసార్లు, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల శరీరంలోనే వ్యర్థాలు పేరుకుపోయి రక్తంలో ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మూత్రాశయం అనేది యూరిన్‌ను నిల్వ చేసుకునే ఒక సంచి లాంటి భాగం. ఇది నిండిపోయినప్పుడు మెదడుకు సంకేతాలు పంపి, మూత్ర విసర్జన చేయమని గుర్తు చేస్తుంది. అయితే మీరు పదే పదే ఈ సంకేతాలను విస్మరించి మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మెదడు నుండి రావాల్సిన సంకేతాలు సరిగ్గా పనిచేయవు. దీనివల్ల మూత్రాశయం సాగే గుణాన్ని కోల్పోయి, పూర్తిగా ఖాళీ చేయడంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Model San Rachel: మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ సూసైడ్.. నల్లగా ఉన్నావని విమర్శలే కారణమా?
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం