Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు

Whatsapp New Feature: వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను తీసుకొస్తుంటుంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. పర్సనల్ నుంచి ఆఫీస్ పనుల కోసం ఎక్కువగా ఈ వాట్సాప్‌ను వాడుతున్నారు. అసలు వాట్సాప్ లేకపోతే మాత్రం పనులు జరగవు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వాట్సాప్ వాడుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు కూడా వాట్సాప్ వాడుతున్నారు. స్టేటస్, సాంగ్, వీడియో, ఆడియో కాల్‌లో ఫీచర్లు వంటివి ఎక్కువగా ఉన్నాయి. యూజర్ల కోసం వాట్సాప్ వీటిని ఎప్పుటికప్పుడు అప్డేట్ చేస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం మరో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. వాట్సాప్‌లో యాడ్ ఆప్షన్ యాక్టివ్ అయినట్లు మెటా సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లే యాడ్స్ కూడా ఫస్ట్ స్టేటస్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. అలాగే చాట్ లిస్ట్‌లో నాన్ ఇంట్రూసివ్ యాడ్ ప్లేస్‌మెంట్‌లను కూడా మెటా పరీక్షిస్తుంది. అయితే దీనివల్ల యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుంది ఏమోనని కొందరు భావించారు. కానీ దీనివల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కూడా కలగదు. వ్యక్తిగత సందేశాలతో ప్రకటనలకు సంబంధం ఉండదని కూడా సంస్థ తెలిపింది. అయితే ఈ యాడ్స్ త్వరలోనే లైవ్ కూడా కానున్నయి.
ఇదిలా ఉండగా వాట్సాప్ ఇటీవల ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ ఛానల్స్‌లో యూజర్లు వారికి ఇష్టమైన వారిని ఇప్పుడు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. కాకపోతే వీటికి ప్రతీ నెలా కూడా రుసుము చెల్లించాలి. అయితే ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రత్యేకమైన కంటెంట్ వస్తుంది. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఛానల్ అడ్మిన్లకు రెగ్యులర్ సపోర్ట్ పొందవచ్చు. అలాగే మిగతా వారితో పోలిస్తే వీరికి సపరేట్ కంటెంట్ వస్తుంది. అలాగే కొత్త ఛానళ్లను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఛానల్‌కి ఉన్న అడ్మిన్లు వారి ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సరికొత్త ఫీచర్ వల్ల ఛానల్స్, బిజినెస్ స్టేటస్ ట్యాబ్‌లో యాడ్స్ చూపించవచ్చు. అయితే దీనివల్ల యూజర్లకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాగంటే.. ప్రొడక్ట్ లేదా సర్వీస్‌కు సంబంధించిన చాట్ ప్రారంభించవచ్చు. దీనికోసం యూజర్లకు మంచి అవకాశం లభిస్తుంది. ఇది బిజినెస్ కమ్యూనికేషన్ కోసం ప్రత్యేక అవకాశాలు కూడా ఇస్తుంది. అయితే ఇన్ని ఫీచర్లు ఇస్తుందని ప్రైవసీ లేదని అనుకోవచ్చు. కానీ వీటికి ప్రైవసీ కూడా ఉంది. మీరు ఇతరులకు పంపించే మెసేజ్‌లు, కాల్స్, స్టేటస్‌లు ఇలా అన్నింటికి కూడా ప్రైవసీ ఉంటుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ ఉంటుంది. ఎవరూ కూడా ఇతరుల ప్రైవసీని కూడా చూడలేరని మెటా తెలిపింది.
ఇది కూడా చూడండి: Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Google New Feature: గూగుల్ సెర్చింగ్‌లో ఈ కొత్త ఫీచర్ గమనించారా.. ఇక బ్రౌజర్లకు పండగే
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Mahindra : నెక్సాన్, బ్రెజ్జాకు గట్టిపోటీ.. మహీంద్రా చౌకైన కారు అప్ డేటెడ్ వెర్షన్ వస్తోంది
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?