Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: వెండి తెరకు చిరంజీవి ఎలాగో, బుల్లితెరకు హీరో అంటే ఫస్ట్ వినిపించే పేరు సుధీర్. బుల్లితెరలో వచ్చిన ఏ షోలో అయినా సుధీర్ ఉన్నాడంటే చాలు.. ఇక ఆ షో హిట్ కావడం గ్యారెంటీ. ఒక ఛానెల్ అనే కాదు.. ఏ ఛానెల్‌లో, ఏ షోలో అయినా కూడా సుధీర్ ఉంటే అది పక్కా సక్సెస్ అవుతుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుధీర్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ షో తర్వాత ఢీ వంటి షోలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం సుధీర్ డ్రామా జూనియర్స్‌లో యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ప్రస్తుతం బాగా హిట్ అవుతోంది. చిన్న పిల్లలు కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. మంచి స్కిట్‌లు వేయడంతో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ షోకి సుధీర్ యాంకరింగ్ చేయగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పిల్లలు స్కిట్ చేసేటప్పుడు సుధీర్‌ను రోస్ట్ చేస్తుంటారు. ఇతనిపైనే పంచులు వేస్తుంటారు. ఒకరనే కాకుండా షోలో ఉన్నవారంత కూడా సుధీర్‌పై పంచులు వేస్తుంటారు. సుధీర్ కూడా వాళ్లకి సపోర్ట్ చేస్తూ కామెడీ చేస్తాడు. నిజానికి చాలా మంది సుధీర్ కోసమే ఈ షో చూస్తుంటారు. అయితే ఈ షోలో జడ్జిగా ఉన్న అనిల్ రావిపూడి సుధీర్ ఎందుకు రోస్ట్ చేస్తున్నారో అనే దానిపై సంచలన విషయాలను బయటపెట్టారు.
డ్రామా జూనియర్స్‌లో సుధీర్‌ను అందరూ కూడా రోస్ట్ చేసేవారు. తన మీద డైలాగ్‌లు కూడా ఎక్కువగా వేస్తుంటారు. అయితే షో వాళ్లు కూడా సుధీర్‌ను రోస్ట్ చేయడమే మెయిన్ కాన్సెప్ట్ అని షో మేనేజ్‌మెంట్ చెప్పేవారని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా చెప్పడం వల్లనే షోలో అలా చేస్తామని అన్నారు. అయితే అలా చెప్పినా కూడా నేను చాలా వరకు పంచులు వేసేవాడిని కాదు.. ఎందుకంటే అవి హద్దులు దాటినట్లు ఉంటాయని అనిల్ రావిపూడి తెలిపారు. అయితే సుధీర్ కూడా ఇలాంటివి పట్టించుకోడు. చాలా సింపుల్‌గా ఉంటాడు. ప్రజలకు నవ్వడం, హ్యాపీగా ఉండటం కావాలి. ఇవన్నీ కామన్.. మీరేం ఇబ్బంది పడవద్దు. జోక్‌లు వేయమని సుధీర్ అనేవాడని అనిల్ రావిపూడి తెలిపారు. అందుకే నాకు సుధీర్ అంటే ఇష్టమని అనిల్ రావిపూడి అన్నారు. సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. అయినా కూడా తనపై ఎలాంటి పంచ్‌లు వేసినా కూడా తీసుకోగలుగుతున్నాడు. ఇలా ఇంకా ఎవరికీ సాధ్యం కాదు.. కేవలం సుధీర్‌కు మాత్రమే సాధ్యమని అన్నారు. సుధీర్‌ను ఎవరైనా కూడా ఇష్టపడతారని అనిల్ రావిపూడి సుధీర్‌పై ప్రశంసం వర్షం కురిపించారు.
Read Also:Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్
-
RGV Sensational Comments: సందీప్ వంగా, దీపికా పదుకొణె ఇష్యూపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
Prakash Raj: కోట శ్రీనివాస రావు అందరికీ నచ్చలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?