Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్

Shubman Gill : టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఇదివరకు జరగనిది చేసి చూపించింది. శుభ్‌మన్ గిల్ కేవలం భారత కెప్టెన్‌గానే కాకుండా, ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మొదటి ఆసియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, ఈ అద్భుత విజయం తర్వాత ఎవరో కనిపించకుండా పోయారట. టీమిండియా మ్యాచ్ గెలిచిన వెంటనే కెప్టెన్ శుభమాన్ గిల్ తన కోసం వెతికాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా అతడు ఎక్కడ ఉన్నాడు ? అని ఓ వ్యక్తి గురించి శుభమాన్ అడిగాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా ఇంగ్లాండ్‌లో మాత్రమే కాదు, విదేశీ గడ్డపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.
Read Also:Kajol : 11ఏళ్ల వయసులోనే స్కూల్ నుంచి పారిపోయిన కాజోల్..ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ రివీల్
ఎడ్జ్‌బాస్టన్ విజయం తర్వాత శుభ్‌మన్ గిల్ వెతికిన వ్యక్తి తన టీం ప్లేయర్ గానీ, సపోర్ట్ స్టాఫ్ కూడా కాదు తనో జర్నలిస్ట్. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శుభ్‌మన్ గిల్ అతన్ని తన ఫేవరెట్ జర్నలిస్ట్ అని చెప్పాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు, భారత్‌కు ఈ మైదానంలో ఉన్న చెత్త రికార్డు గురించి ఈ జర్నలిస్ట్ గిల్‌ను ప్రశ్నించాడు. అప్పుడు శుభ్‌మన్ గిల్ తన మాటలతో సమాధానం చెప్పాడు. ఇప్పుడు చెప్పింది చేసి చూపించి కూడా సమాధానం ఇచ్చాడు. అందుకే విజయం తర్వాత అతన్ని వెతికాడు.
Read Also:Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు, శుభ్‌మన్ గిల్ ఇలా అన్నాడు.. “గత 58 ఏళ్లలో ఏం జరిగిందో రికార్డులను నేను నమ్మను, ఎందుకంటే ప్రతిసారీ ఒక కొత్త జట్టు ఆడుతుంది. ప్రస్తుతం మా టీం బెస్ట్ గా ఉంది. ఎలాంటి ప్రత్యర్థినైనా, ఏ మైదానంలోనైనా ఓడించగల సత్తా మాకు ఉంది.” అప్పుడు గిల్ మాటలను ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ఇప్పుడు అతను దానిని నిరూపించాడు. అందుకే, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ గెలిచిన తర్వాత అతను ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చినప్పుడు, తనను ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ గురించి మొదట అడిగాడు. అంతా సవ్యంగా జరిగితే ఈ సిరీస్‌ను చరిత్రలో గుర్తుండిపోయేలా చేయడానికి తమవంతు కృషి చేస్తామని గిల్ చెప్పాడు.
-
Ravichandran Ashwin Comments On Shubman Gill: శుభ్ మన్ గిల్ పై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్
-
Kuldeep Yadav: మాంచెస్టర్ టెస్టులో కుల్ దీప్ ఆడతాడా?
-
India Vs England 3rd Test: మహ్మద్ సిరాజ్ బ్యాడ్ లక్.. భారత్ ఎలా ఓడిపోయిందంటే..
-
Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు