Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు

Joe Root : లీడ్స్, బర్మింగ్హామ్లలో పెద్ద స్కోర్లు చేయలేకపోయిన ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జో రూట్ ఎట్టకేలకు మూడో టెస్టులో బ్యాట్ జులుపించాడు. చారిత్రాత్మక లార్డ్స్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో జో రూట్ సెంచరీ కొట్టాడు. లార్డ్స్‌లో ఇప్పటికే పలు అద్భుతమైన, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఈ మైదానంలో భారత్‌పై మరో అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లీష్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇది రూట్ టెస్ట్ కెరీర్లో 37వ శతకం. దీంతో అతను భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ లను వెనక్కి నెట్టాడు.
జూలై 10న లార్డ్స్‌లో ప్రారంభమైన మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు బ్యాటింగ్‌కు దిగిన రూట్, 99 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో రెండో రోజు అతను సెంచరీ పూర్తి చేస్తాడా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఈ ఒత్తిడి అధిగమించి జో రూట్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ రూట్ రెండో రోజు మొదటి బంతిని ఫోర్‌గా మలిచి తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్లలో 5వ స్థానానికి చేరుకున్నాడు.
Read Also:Flipcart Goat Sale: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ స్టార్ట్.. వీటి మీద అదిరిపోయే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు జో రూట్ మొదటి సెషన్లోనే క్రీజులోకి దిగాల్సి వచ్చింది. కేవలం 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో జో రూట్, ఆలీ పోప్ తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ తోడుగా నిలిచాడు. మొదటి రోజు ఆట ముగిసే వరకు వికెట్ పడకుండా ఈ ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. అయితే, ఈ సమయంలో రూట్ 99 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్నాడు. రెండో రోజు అతను సెంచరీ పూర్తి చేయడం కోసం ఎదురుచూశారు. రూట్ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మైలురాయిని చేరుకుని టెస్ట్ క్రికెట్లో తన పేరు మీద ఒక కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.
జో రూట్ ఖాతాలో ఇప్పుడు 37 సెంచరీలు ఉన్నాయి. ఈ విధంగా అతను భారత మాజీ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్, ఆస్ట్రేలియా ప్రస్తుత స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ లను వెనక్కి నెట్టాడు. వీరిద్దరి పేర్ల మీద చెరో 36 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(51), జాక్ కల్లిస్(45), రికీ పాంటింగ్(41), కుమార్ సంగక్కర(38) ల తర్వాత రూట్ అత్యధిక సెంచరీలు సాధించిన 5వ బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. అంతేకాదు, ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు అతని పేరు మీదే ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో ఇది అతని 8వ టెస్ట్ సెంచరీ. ఇక భారత్‌పై 11వ సారి 100 పరుగుల మార్కును దాటి, అతను స్టీవ్ స్మిత్ తో సమానంగా నిలిచాడు.
Read Also:Curd: పెరుగు మిగిలిపోయి వేస్ట్ కావద్దంటే.. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందమే అందం
-
Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్
-
Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్