Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్

Lords Test : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 387 పరుగుల వద్ద ముగించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 251 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, రెండో రోజు ఆటను అక్కడి నుంచి కొనసాగించింది. రెండో రోజు మాజీ కెప్టెన్ జో రూట్ తన సెంచరీని పూర్తి చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జేమీ స్మిత్, కేఎల్ రాహుల్ ఇచ్చిన లైఫ్ లైన్ సద్వినియోగం చేసుకొని హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. అలాగే పేస్ బౌలర్ బ్రైడన్ కార్స్ కూడా 56 పరుగులు చేశాడు. మిగిలిన ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. టీమిండియా తరఫున బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీయగా, నితీష్ రెడ్డి, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ తీశాడు.
రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌కు మంచి ప్రారంభం లభించలేదు. దీంతో మొదటి సెషన్లోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు బుమ్రా ఖాతాలోకి వెళ్లాయి. బుమ్రా కొన్ని నిమిషాల వ్యవధిలోనే బెన్ స్టోక్స్(44), జో రూట్ (104), క్రిస్ వోక్స్(0) లను పెవిలియన్‌కు పంపాడు. దీని తర్వాత జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ అద్భుతమైన పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 80కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ సమయంలో సిరాజ్ బౌలింగ్‌కు దిగి 56 బంతుల్లో 51 పరుగులు చేసిన జేమీ స్మిత్‌ను ఔట్ చేశాడు.
Read Also:7 Days in Week: వారానికి ఏడు రోజులే ఎందుకు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?
దీని తర్వాత బుమ్రా, జోఫ్రా ఆర్చర్ వికెట్ తీశాడు. అయితే, పేసర్ బ్రైడన్ కార్స్ భారత్‌పై తన మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేయడంలో సక్సెస్ అయ్యాడు. అతను 83 బంతుల్లో ఆరు బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. పందెం మొదటి రోజు జాక్ క్రౌలీ 18, బెన్ డకెట్ 23, ఓలి పోప్ 44 పరుగులు చేశారు.
ఇక మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 113 బంతుల్లో 53 పరుగులు, రిషబ్ పంత్ 33 బంతుల్లో 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ కంటే 242 పరుగుల వెనుకబడి ఉంది. ఈ మ్యాచులో కూడా రాణిస్తాడని అనుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎక్కువసేపు మైదానంలో నిలవలేదు. కేవలం 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Read Also:Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Asia Cup 2025: ఆసియా కప్ కు భారత జట్టు ఇదే..
-
Gavaskar Comments On Siraj: సిరాజ్ పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Joe Root Comments On Siraj: సిరాజ్ పై జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
England Vs India 4th Test: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్.. భారత్ కు కఠిన పరీక్ష
-
Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు