7 Days in Week: వారానికి ఏడు రోజులే ఎందుకు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?

7 Days in Week: ఏదైనా ప్లాన్ వేసే ముందు మొదట క్యాలెండర్ చూస్తాం. ఏ రోజు, ఏ వారం, ఏ సంవత్సరం ఇలా మొత్తం చూస్తుంటాం. అయితే సాధారణంగా ఒక రోజు తర్వాత ఇంకో రోజు అనేది వస్తుంది. అలాగే ఏడు రోజులు పూర్తి అయిన తర్వాత మళ్లీ వారం ప్రారంభం అవుతుంది. వారంలో ఎనిమిది లేదా తొమ్మిది రోజులు ఉండవచ్చు కదా. కానీ ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి. అసలు వారంలో ఏడు రోజులే ఎందుకు? మిగతా రోజులు ఎందుకు ఉండవు? దీనికి గల కారణాలు ఏంటి? అసలు వారంలో ఏడు రోజులు అనేది ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి ఇది ఉందనే పూర్తి వివరాలు అన్ని కూడా ఈ స్టోరీలో చూద్దాం.
వారంలో ఏడు రోజులు అనేది పురాతన నాగరికతల నుంచి వచ్చింది. క్రీస్తుపూర్వం 2300లో అక్కాడ్‌కు చెందిన సర్గోన్ I పాలనలో చంద్ర చక్రం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 14.5 రోజులుగా నిర్ణయించారు. అయితే ఏడు రోజుల వారం అనేది దీని నుంచే వచ్చింది. ఇందులో సగం 7.25 రోజులతో వారం ప్రారంభమైంది. అయితే మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వారంలోని ఏడు రోజులు కంటితో కనిపించే ఏడు గ్రహాల పేర్లతో పేరు పెట్టారని అందుకే వచ్చిందని అంటున్నారు. ప్రాచీన నాగరికతలలో ముఖ్యంగా మెసొపొటేమియా (బాబిలోనియన్లు)లో, ఖగోళ వస్తువులు అయిన సూర్యుడు, చంద్రుడు, ఐదు గ్రహాలు అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనిని దేవతలుగా పూజించారు. ఈ ఖగోళ వస్తువులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నమ్మేవారు. అలాగే రోమన్ నాగరికత ఈ వారం రోజుల వ్యవస్థను మరింత అభివృద్ధి చేసిందని చెప్పుకుంటారు. రోమన్ ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం జూలియస్ సీజర్, అగస్టస్ పాలనలో సంవత్సరాన్ని 10 నెలల నుండి 12 నెలలకు విస్తరించారు. చంద్ర చక్రం ఆధారంగా 12 నెలలు నిర్ణయించారు. క్యాలెండర్‌ను సమతుల్యం చేయడానికి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీపు సంవత్సరం కూడా ఉంది. అయితే రాయల్ మ్యూజియం గ్రీన్విచ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతులకు ఏడు రోజుల వారం ముఖ్యమైనది.
భారతదేశంలో వేద కాలంలో ఏడు రోజుల యజ్ఞాలు నిర్వహించారు. ప్రారంభంలో ఈ రోజులకు నిర్దిష్ట పేర్లు లేవు. మొఘల్ పాలనలో అలెగ్జాండర్ జావానీస్ సంస్కృతి ప్రభావం కారణంగా భారతదేశంలో ఏడు రోజుల వారం అనే భావన వచ్చింది. గరుడ పురాణం వంటి హిందూ గ్రంథాలు ఏడు రోజుల వారం గురించి ప్రస్తావిస్తాయి. దీనిలో గ్రహాల కదలికను జ్యోతిష శాస్త్రం ఆధారంగా తెలుసుకుంటారు. అయితే పౌరాణిక ఇతిహాసాల ప్రకారం ప్రపంచం ఏడు రోజుల్లో సృష్టించారని, దీంతో భూమి చుట్టూ చంద్రుని 27.3 రోజుల చక్రం ఏడు రోజుల వారం ఏర్పడటానికి ఆధారం అయ్యిందని నమ్ముతారు. ఈ గ్రహాల కదలిక జ్యోతిష శాస్త్ర సంకేతాలను నిర్ణయించిందని అందుకే ప్రపంచవ్యాప్తంగా వారం ఫిక్స్ చేశారు. ఈ ఏడు గ్రహాల ఆధారంగా వారం, నెల, సంవత్సరంగా ప్రపంచమంతా కూడా అనుసరిస్తోంది. ఇలా పురాతన ఖగోళ శాస్త్రం, మత విశ్వాసాలు, వివిధ నాగరికతల మధ్య సాంస్కృతిక మార్పిడి వల్ల వారం అంటే ఏడు రోజులు అని వచ్చింది.
ఇది కూడా చూడండి: Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?