Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?

Baahubali the Epic: భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన బాహుబలి మూవీ అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రీరిలీజ్ కానుంది. రిలీజ్ అయి పదేళ్లు కావడంతో ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రెండు పార్ట్‌లను కలిపి ఒకే పార్ట్‌గా రీరిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీన్ని ఎడిట్ చేసి మొత్తం ఒకే పార్ట్‌లో కొత్త వెర్షన్‌ను బాహుబలి ది ఎపిక్‌ను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా రెండు పార్ట్‌లను కట్ చేసి రీలజ్ చేస్తారా? లేకపోతే సమయం తగ్గిస్తారా? అని చాలా మంది అనుకున్నారు. కానీ ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ (2017) చిత్రాలను కలిపి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా 5 గంటల 27 నిమిషాలతో రీరిలీజ్ చేయనున్నారు. ఇది బుక్ మై షోలో చూపించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇన్ని గంటలు అసలు ఎవరైనా థియేటర్లలో కూర్చుంటారా అని అంటున్నారు. మూడు గంటల పాటు థియేటర్లలో కూర్చుంటేనే చిరాకు వస్తుంది. అలాంటిది ఇన్ని గంటలు ఏంటని అంటున్నారు. మరికొందరు ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసినట్లే ఏముంది చూడవచ్చని అంటున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటించారు. రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015) వచ్చి పదేళ్లు కావడంతో రీరిలీజ్‌ను ప్రకటించారు. ఈ సినిమాతో తెలుగు మూవీ సీక్వెల్, పాన్ ఇండియా వంటి వాటిని పరిచయం చేశారు. రాజమౌళి తర్వాతే అందరూ వీటిని చేయడం ప్రారంభించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి: ది బిగినింగ్’ రూ.650 కోట్లు వసూలు చేయగా, ‘బాహుబలి 2’ రూ.1788.06 కోట్లు వసూలు చేసింది. మరి ఇప్పుడు రీరిలీజ్ అయితే ఎంత కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. ఇన్ని గంటలు రన్ టైం ఉంటే అసలు ఎవరు చూస్తారని అంటున్నారు. మరికొందరు కట్టప్ప సీన్‌కే ఒక 20 నిమిషాలు అయిపోతుంది. ఇంకా సినిమా మొత్తం చూడాలంటే ఈ మాత్రం సమయం పడుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా ప్రభాస్ సినిమా చూడాలంటే ఇన్ని గంటలు థియేటర్లలో చూడాల్సిందేనని అంటున్నారు. మరి ఇన్ని గంటలు ఉన్న బాహుబలి ది ఎపిక్ ను చూడబోతున్నారా? లేదా? కామెంట్ చేయండి.
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Prabhas : ప్రభాస్ చెల్లెలు చేసిన పనికి నెట్టింట రచ్చ.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Movie piracy: మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీలకు సినిమాలు అమ్మింది ఇతడే.. వేల కోట్ల నష్టం తెప్పించాడు