SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి

SSMB29 : దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో SSMB29 వస్తున్న సంగతి తెలిసిందే.అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల వీరు ఆఫ్రికాలోని కెన్యా వెళ్లి కీలక సన్నివేశాలను షూట్ చేయాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ షూటింగ్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్లాన్‌ను మార్చుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కెన్యాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేనని తెలుస్తోంది. రాజమౌళి జూలై నాటికి కెన్యా వెళ్లి కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆఫ్రికా దట్టమైన అటవీ ప్రాంతాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించాలనే ఆలోచన ఉంది. అయితే, కెన్యాలో ప్రస్తుతం రాజకీయ అస్థిరత నెలకొంది. అక్కడి పరిస్థితి సరిగా లేదు. ఈ కారణంగా అక్కడ షూటింగ్ చేయడం అనుమానంగా మారింది.
Read Also:Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
రాజమౌళి ఎప్పుడూ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఆయన దగ్గర ఎప్పుడూ చాలా ప్లాన్‌లు రెడీగా ఉంటాయి. ఇప్పుడు ప్లాన్ ఏ క్యాన్సిల్ అయ్యే సూచనలు కనిపిస్తుండడంతో ఆయన ప్లాన్ బీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. అంటే, ఇదే షూటింగ్‌ను వేరే ఏదైనా లొకేషన్‌లో ప్లాన్ చేయవచ్చు. లేదా, ప్రస్తుతం వేరే సన్నివేశాలను షూట్ చేసి, ఆ తర్వాత కెన్యాలో పరిస్థితి కుదుటపడిన తర్వాత అక్కడికి వెళ్లవచ్చు అని తెలుస్తోంది.
Read Also:Manjummel Boys : రూ.250కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ హీరో, నిర్మాత సౌబిన్ అరెస్టు
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా గురించి చిత్ర బృందం ఇప్పటివరకు పెద్దగా సమాచారం బయటపెట్టలేదు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. రాజమౌళితో సినిమా చేయాలంటే చాలా ఏళ్లు సమయాన్ని కేటాయించడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే నిబద్ధతతో ఈ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం 2026 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
Rajamouli : మహేష్ సినిమా కోసం ఏకంగా ఓ నగరాన్ని నిర్మిస్తున్న దర్శక ధీరుడు జక్కన్న
-
Sitara: తండ్రికి తగ్గ తనయ.. స్టార్ హీరోయిన్ కంటే సితార ఫాలోయింగ్ మాములుగా లేదుగా!
-
Priyanka Chopra: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక?