Manjummel Boys : రూ.250కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ హీరో, నిర్మాత సౌబిన్ అరెస్టు

Manjummel Boys : గతేడాది విడుదలైన మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీసు దగ్గర భారీగా హిట్ సాధించింది. అంతేకాకుండా ఆ సంవత్సరానికి బెస్ట్ మూవీలలో ఒకటిగా నిలిచింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. భారీ కలెక్షన్లు వచ్చిన తర్వాత సినిమా బృందంలో విభేదాలు తలెత్తాయి. సినిమా హీరో, నిర్మాత అయిన సౌబిన్ షాహిర్ పై గతంలోనే ఫిర్యాదు నమోదైంది. తాజాగా, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి, ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు.
‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాకు సంబంధించి గతేడాదే నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, బాబు ఆంటోనీ లపై ఫిర్యాదు నమోదైంది. అయితే, నిందితులు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి బెయిల్ పొందారు. అయితే, ఇటీవల కేరళలోని కొచ్చిలోని మరాడు పోలీస్ స్టేషన్ అధికారులు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, బాబు ఆంటోనీలను ఈ కేసు విషయమై సుమారు రెండు రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.
Read Also: Skincare : వానాకాలంలో స్కిన్ అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు నుంచి రక్షించుకునే చిట్కాలివే!
సిరాజ్ వలయత్తూరు అనే వ్యక్తి ఈ ముగ్గురు నిర్మాతలపైనా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడి ప్రకారం, ఈ ముగ్గురు ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా నిర్మాణానికి వివిధ సందర్భాలలో ఏడు కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. అప్పుకు బదులుగా సినిమా లాభంలో 40శాతం వాటాను ఇస్తామని చెప్పి డబ్బు తీసుకున్నారట. కానీ ఇప్పుడు 40శాతం డబ్బు ఇవ్వడం లేదని సిరాజ్ వలయత్తూరు ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశారు.
‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. లాభంలో 40% డబ్బు ఇస్తే, దాదాపు రూ.100 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు అధికారిక నిర్మాతలకు ఇంత పెద్ద మొత్తం లాభం వచ్చి ఉండడం అనుమానమే. అందుకే నిర్మాతలు న్యాయపరంగా పోరాడుతున్నారు. ఇది మాత్రమే కాదు, సినిమాలోని ఒక పాట కూడా వివాదానికి కారణమైంది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో తమిళ నటుడు కమల్ హాసన్ నటించిన ‘గుణ’ సినిమాలోని ఒక ప్రసిద్ధ పాటను ఉపయోగించారు. ఆ సినిమా సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమాపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు చేశారు. ఆ కేసు కూడా ప్రస్తుతం కొనసాగుతోంది.
Read Also:Alia Bhatt : అసిస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ ఆలియా భట్