Alia Bhatt : అసిస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ ఆలియా భట్

Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, మాజీ పర్సనల్ అసిస్టెంట్‌ను మోసం కేసులో అరెస్ట్ చేశారు. అలియా భట్, ఆమె ప్రొడక్షన్ కంపెనీకి రూ.76.9 లక్షల మోసం చేసిన ఆరోపణలపై అలియా అసిస్టెంట్ వేదికా ప్రకాష్ శెట్టి (32)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా వేదికా ప్రకాష్ శెట్టి, అలియా భట్‌కు అత్యంత సన్నిహిత సహాయకురాలిగా పనిచేశారు. 2022 నుండి 2024 వరకు వేదికా ప్రకాష్ శెట్టి అలియా పర్సనల్ అకౌంట్ల నుంచి, ఆమె నిర్మాణ సంస్థ అయిన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ నుంచి రూ.76.9 లక్షలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అలియా భట్ తల్లి సోని రజ్దాన్ ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
2021 నుండి 2024 వరకు వేదికా, అలియా భట్ అసిస్టెంటుగా పనిచేశారు. ఇదే సమయంలో ఆమె అలియా భట్ షూటింగ్ డేట్స్, కొన్ని ఆర్థిక రికార్డులను కూడా చూసుకునేవారు. అలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ఆర్థిక వ్యవహారాలను కూడా ఆమె పర్యవేక్షించేవారు. ఈ సమయంలో, అలియా సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ బిల్లులను క్రియేట్ చేసి, ఆలియా నుంచి సంతకాలు తీసుకుని ఆర్థిక మోసానికి పాల్పడినట్లు సమాచారం.
వేదికా, ఈ విధంగా మోసం చేసిన డబ్బును తన ఫ్రెండ్ ఖాతాకు బదిలీ చేసి, అక్కడి నుండి మళ్ళీ తన ఖాతాకు మార్చుకుంటూ వచ్చారట. ఈ ఘటన వెలుగులోకి రాగానే వేదికా పరారయ్యారు. సోని రజ్దాన్ ఫిర్యాదు చేసిన ఐదు నెలల తర్వాత ఇటీవల పోలీసులు వేదికాను బెంగుళూరులో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా, జూలై 20 వరకు ఆమెను పోలీస్ కస్టడీకి అప్పగించింది.
అలియా భట్ తన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా కొన్ని సినిమాలను నిర్మించారు. ఆమె నటించిన ‘డార్లింగ్స్’, ‘జిగ్రా’ సహా మరికొన్ని సినిమాలను ఆమె నిర్మించారు. అలియా భట్ ప్రస్తుతం తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తున్నారు. దాంతో పాటు ‘ఆల్ఫా’ అనే యాక్షన్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
Read Also:Money Saving : సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు ఉంచితే ఎంత నష్టమో తెలుసా ? మరి ఎక్కడ పెడితే లాభం?
-
Kajol : 11ఏళ్ల వయసులోనే స్కూల్ నుంచి పారిపోయిన కాజోల్..ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ రివీల్
-
Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట
-
Kangna Sharma : “బట్టలు విప్పే పోటీ జరుగుతోందా?”.. కంగనా శర్మపై నెటిజన్ల ట్రోలింగ్!
-
Katrina Kaif : సల్మాన్-రణ్‌బీర్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? షాకింగ్ ఆన్సర్ చెప్పిన కత్రినా
-
Star Heroine: ఇంటర్ తో చదువు ఆపేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.. కోట్లలో ఆస్తిపాస్తులు.. ఎవరో తెలుసా…
-
Bollywood Actress : పాన్ ఇండియా స్టార్ కి తల్లిగా, బాలీవుడ్ హీరో కి ప్రియురాలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుస్తా.. ఈమె ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..