Bigg Boss : పచ్చళ్లలోనే కాదు బిగ్ బాస్ లోనూ ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ చాలా కాస్ట్లీ.. రమ్య ఎంట్రీ కన్ఫాం

Bigg Boss : బుల్లితెర తెలుగ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో ప్రారంభానికి రెడీ అవుతుంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లు కన్ఫాం అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య మోక్ష, ఈ రాబోయే సీజన్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ‘ఆలేఖ్య చిట్టి పికిల్స్’ బ్రాండ్‌తో ఆమె ఇటీవల కాలంలో ఎంతటి హంగామా క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో ఆ పాపులారిటీని బిగ్ బాస్ క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె బిగ్ బాస్ ఎంట్రీ కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు తెలస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9, 2025 సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. ఈసారి కూడా మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇది ఆయనకు వరుసగా ఏడవ సీజన్ కావడం విశేషం. బనిజాయ్ నిర్మిస్తున్న ఈ రియాలిటీ సిరీస్ స్టార్ మాలో ప్రసారం కానుంది. జియో హాట్స్టా ద్వారా స్ట్రీమింగ్కు కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో ఒక కొత్త ట్విస్ట్ ఉంది.. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారిగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అనుమతిస్తారు.
Read Also:Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు
రమ్య మోక్ష తన ఇన్స్టాగ్రామ్, తన చెల్లెళ్లతో కలిసి నడుపుతున్న ‘ఆలేఖ్య చిట్టి పికిల్స్’ వ్యాపారం ద్వారా పాపులర్ అయ్యారు. గతంలో ఒక కస్టమర్‌తో జరిగిన బహిరంగ వివాదం కారణంగా ఆమె మీడియా దృష్టిని ఆకర్షించారు. వివాదాలు ఉన్నప్పటికీ, ఆమెకు ఉన్న భారీ ఫాలోయింగ్ తనను బిగ్ బాస్ షోలో నిలబెడుతుందని అంటున్నారు. గతంలో ఆమె తెలుగు సినిమాలో అరంగేట్రం చేయనున్నట్లు ఊహాగానాలు వచ్చినా, వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రాబోయే సీజన్‌ను డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, సైకలాజికల్ టాస్క్‌ల కంటే ఫిజికల్ టాస్క్‌లపై దృష్టి పెట్టి డిజైన్ చేసినట్లు సమాచారం. ఈసారి అనేక వివాదాస్పద ఇంటర్నెట్ పర్సనాలిటీలను కూడా కంటెస్టెంట్లుగా తీసుకురావాలని చూస్తున్నారు. దీంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
Read Also:Money Saving : సేవింగ్స్ అకౌంట్లో డబ్బు ఉంచితే ఎంత నష్టమో తెలుసా ? మరి ఎక్కడ పెడితే లాభం?