Airtel Plans : ఎయిర్టెల్ 3 కొత్త ప్లాన్లు.. 25కు పైగా ఓటీటీ యాప్‌లు, బోలెడన్ని ప్రయోజనాలు!

Airtel Plans : ఎయిర్టెల్ (Airtel) తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఆల్-ఇన్-వన్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్‌లను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్లతో పాటు, ఓటీటీ (OTT) యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తాయి. 25కు పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ అందించే ఈ ప్లాన్ల ధర కేవలం రూ. 279 నుంచే మొదలవుతుంది. మరి ఏ ప్లాన్ ధర ఎంత? వాటిలో ఏ ఏ ప్రయోజనాలు లభిస్తాయో వివరంగా తెలుసుకుందాం.
ఎయిర్టెల్ రూ. 279 ప్లాన్
రూ. 279 ధరతో వచ్చే ఎయిర్టెల్ ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రూ. 750 విలువైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే ఒక నెలకు అన్ని డివైజ్‌లలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ (Netflix Basic), జియోహాట్‌స్టార్ సూపర్ (JioHotstar Super), సోనీ లివ్ (SonyLIV), జీ5 ప్రీమియం (ZEE5 Premium), లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play), సన్నెక్స్ట్ (SunNXT), ఈరోస్ నౌ (Eros Now) వంటి 25కు పైగా ఓటీటీల ప్రయోజనం లభిస్తుంది. ఓటీటీ యాప్‌లతో పాటు, 1GB హై-స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత ప్రతి MBకి 50 పైసలు ఛార్జ్ చేస్తారు. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు.
Read Also:IMD Forecast : రైతన్నలకు శుభవార్త.. ఐఎండీ సంచలన అంచనా.. జూన్ లోనే కుండపోతలట
ఎయిర్టెల్ రూ. 598 ప్లాన్
రూ. 598 ధరతో వచ్చే ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2GB హై-స్పీడ్ 5G డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ , రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో జియోహాట్‌స్టార్ సూపర్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం (Airtel Xstream Play Premium) తో పాటు 22కు పైగా ఓటీటీ యాప్‌లు, ఉచిత హెలోట్యూన్ బెనిఫిట్ లభిస్తుంది. అయితే, గమనించదగ్గ విషయం ఏమిటంటే.. రూ. 598 ఖర్చు చేసినప్పటికీ దీని వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే. ఇది తరచుగా స్ట్రీమింగ్ చేసే వారికి, అన్లిమిటెడ్ 5G డేటా కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.
ఎయిర్టెల్ రూ. 1729 ప్లాన్
రూ. 1729 ధరతో వచ్చే ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌తో కూడా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం తో పాటు 22కు పైగా ఓటీటీ యాప్‌లు, జియోహాట్‌స్టార్ సూపర్ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే వారికి , అన్లిమిటెడ్ కాలింగ్, డేటా, ఓటీటీ ప్రయోజనాలు అన్నీ ఒకేసారి పొందాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
Read Also:Alcohol Ban : 73 ఏళ్ల తర్వాత తొలిసారి.. సౌదీలో ఆల్కహాల్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
ఈ కొత్త ప్లాన్లతో ఎయిర్టెల్ వినియోగదారులకు కాలింగ్, డేటాతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇది వినియోగదారులకు వేర్వేరు ఓటీటీ సబ్స్క్రిప్షన్ల కోసం చెల్లించాల్సిన అవసరం ఉండదు.