Airtel vs. Jio: ఎయిర్టెల్ కొత్త ప్లాన్‌తో జియోకు షాక్.. మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకేసారి!

Airtel vs. Jio: మీరు గనుక ఎయిర్టెల్ యూజర్ అయితే మీకు పండుగే అని చెప్పొచ్చు. ఎయిర్టెల్ తన కస్టమర్ల సౌకర్యం, వినోదంపై దృష్టి సారించి ఒక కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీకు నెట్‌ఫ్లిక్స్ (Netflix), జియోసినిమా (JioCinema), జీ5 (ZEE5) అన్నీ లభిస్తాయి. ఒకే ప్లాన్‌లో మీకు ఒకటి లేదా రెండు కాదు, ఏకంగా మూడు OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తోంది. ఈ ప్లాన్ ధర కూడా తక్కువే. కేవలం రూ.279 బేసిక్ ప్లాన్‌లోనే ఇలాంటి చాలా ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
రూ.279కే మూడు OTTల ధమాకా
ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఈ రూ.279 ప్లాన్ వాలిడిటీ 1 నెల. ఈ ప్లాన్‌లో మీరు పొందే ప్రయోజనాలు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ (Netflix Basic) సబ్స్క్రిప్షన్, జియోసినిమా (JioCinema) సబ్స్క్రిప్షన్, జీ5 ప్రీమియం (ZEE5 Premium) సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. వీటితో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం (Airtel Xstream Play Premium) ద్వారా SonyLIV, Hoichoi, ErosNow, ShemarooMe, Aha, SunNXT వంటి 25కు పైగా OTT ప్లాట్‌ఫారమ్‌ల వినోదం ఒకే చోట లభిస్తుంది. యూజర్‌కు 1GB డేటా కూడా లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, 50 పైసలు/MB చొప్పున ఛార్జ్ అవుతుంది.
Read Also:Viral : రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు జంప్.. సాఫ్ట్ వేర్ ప్రపంచంలోనే సెన్సేషన్
మీరు ఈ సబ్స్క్రిప్షన్లన్నింటినీ విడివిడిగా కొనుగోలు చేస్తే, సుమారు రూ.750 ఖర్చవుతుంది. కానీ ఎయిర్టెల్ వీటిని కేవలం రూ.279కే అందిస్తోంది. అయితే, ఈ ప్లాన్‌లో కాలింగ్ సదుపాయం లభించదు. దాని కోసం మీరు వేరే ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
జియో వర్సెస్ ఎయిర్టెల్: ఆఫర్లలో ఎవరు టాప్?
జియో ప్లాన్లను చూస్తే జియో వద్ద కూడా కస్టమర్లకు అనేక ప్రయోజనాలు అందించే ప్లాన్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఈ ధర (రూ.279)లో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను జియో అందించడం లేదు. OTT కంటెంట్‌తో పాటు అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ కూడా కావాలనుకుంటే ఎయిర్టెల్ వద్ద మరికొన్ని మంచి ప్లాన్లు ఉన్నాయి
Read Also:International Yoga Day 2025:యోగా దినోత్సవం 2025.. విశాఖలో 2.5 లక్షల మందితో భారీ వేడుక.. కొత్త ప్రపంచ రికార్డు!
రూ. 598 ప్లాన్: ఈ ప్లాన్‌లో వినోదంతో పాటు, రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది. దీనికి 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. దీనితో పాటు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి అన్ని OTT యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
రూ. 1729 ప్రీమియం ప్యాక్: ఈ ప్లాన్‌లో మీకు 3 నెలల వాలిడిటీ లభిస్తుంది. 84 రోజుల వాలిడిటీతో ప్రతిరోజూ 2GB డేటా, 100 SMS లభిస్తాయి.నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 తో పాటు 22కు పైగా OTT యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది.ఎయిర్టెల్ తన యూజర్లకు తక్కువ ధరకే ఎక్కువ వినోదాన్ని అందిస్తూ జియోకు గట్టి పోటీ ఇస్తోంది. మీ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్లను ఎంచుకోవచ్చు.