Airtel : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌లో అన్నీ
Airtel : ఎయిర్‌టెల్ ఢిల్లీ, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలలో ఈ ఐపీటీవీని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీనికోసం మీకు సమీపంలో ఉన్న స్టోర్ లేదా ఎయిర్‌టెల్ యాప్ ద్వారా అయినా కొనుగోలు చేయవచ్చు.

Airtel : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం సరికొత్త సేవలను ప్రారంభించింది. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 2 వేల నగరాల్లో ఐపీటీవీ సేవలను ప్రారంభించింది. అయితే దీనిని యాక్టివేట్ చేసుకోవడానికి ప్లాన్‌ను విడుదల చేసింది. తక్కువ ఖర్చుతోనే ప్లాన్‌లు అన్ని కూడా ఇస్తోంది. కేవలం రూ.699 ప్లాన్‌తోనే ఇంటికి లేదా ఆఫీస్‌కి వైఫై పెట్టుకునే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకుంటే కేవలం ఇదే కాకుండా ఎయిర్‌టెల్ ఐపీ టీవీ సబ్‌స్క్రైబర్లు ఆహా, నెట్ ఫ్లిక్స్, ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీ లివ్ సహా 29 స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఇలా మొత్తం 350 టీవీ ఛానెల్‌లు వస్తాయి. దీంతో పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానెల్‌లు అన్ని కూడా ఒకే ప్లాన్‌లో వస్తాయి. మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఈ ప్లాన్‌లను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మీరు ఇందులో ఏదైనా ప్లాన్ కొనుగోలు చేస్తే మాత్రం నెల రోజుల వరకు ఉచితంగా ఐపీటీవీని ఉపయోగించవచ్చు. ఎయిర్‌టెల్ ఢిల్లీ, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలలో ఈ ఐపీటీవీని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీనికోసం మీకు సమీపంలో ఉన్న స్టోర్ లేదా ఎయిర్‌టెల్ యాప్ ద్వారా అయినా కొనుగోలు చేయవచ్చు.
ప్లాన్‌లు వాటి ధరలివే..
రూ. 699
ఈ ప్లాన్‌లో 40 Mbps Wi-Fi కనెక్షన్, 350 టీవీ ఛానెల్‌లకు యాక్సెస్, 26 స్ట్రీమింగ్ యాప్‌ల నుండి కంటెంట్‌తో వస్తుంది.
రూ.899
ఈ ప్లాన్‌లో అధిక బ్రాడ్‌బ్యాండ్ వేగం కోరుకుంటే, రూ. 899 ప్లాన్ తీసుకోవచ్చు. దీంతో 100 Mbps ఇంటర్నెట్ కనెక్షన్, 350 టీవీ ఛానెల్‌లు, 26 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌తో వస్తుంది.
రూ.1,099
ఈ ప్లాన్‌లో ఆపిల్ టీవీ+ వేగవంతమైన ఇంటర్నెట్ కోసం చూస్తున్న వారికి, రూ. 1,099 ప్లాన్ మరింత అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది 200 Mbps ఇంటర్నెట్ వేగం, 28 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 350 టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
రూ.1,599 ప్లాన్
ఈ ప్లాన్‌లో300 Mbps ఇంటర్నెట్ వేగం, నెట్‌ఫ్లిక్స్ సహా 29 స్ట్రీమింగ్ యాప్‌లు, 350 టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ వస్తాయి.
రూ.3,999
ఈ ప్లాన్ 1 Gbps కనెక్షన్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ+తో సహా 29 స్ట్రీమింగ్ యాప్‌లు, 350 టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌తో వస్తుంది.
ఒకే ప్లాన్‌లో మీకు అన్ని రకాలు లభిస్తాయి. మీరు ఈ ప్లాన్ తీసుకుంటే అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు వైఫై తీసుకుంటే దీంతో పాటు కొన్ని ఛానెళ్లు కూడా వస్తాయి. అమెజాన్ వంటివి కూడా ఉంటాయి. మీ బడ్జెట్ బట్టి ఇందులో ఏదో ఒక ప్లాన్ తీసుకుంటే.. అన్ని కూడా ఇందులో వస్తాయి. మీకు ఒకే బడ్జెట్‌లో అన్ని కూడా చూడవచ్చు. వీటిలో మీ బడ్జెట్ బట్టి ప్లాన్‌ను కొనుగోలు చేయండి.
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
-
UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
-
Airtel: ఫ్రీగా వీటిని యూజ్ చేయవచ్చు.. ఎయిర్‌టెల్ కస్టమర్లు ఇది మీకోసమే
-
Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.
-
Hermes Company: ఉద్యోగాలు పోతున్న వేళ.. పింక్ స్లిప్ లు జారీ చేస్తున్న వేళ.. ఈ కంపెనీ చేసిన పనికి ఉద్యోగులు షాక్!
-
Credit Card: క్రెడిట్ కార్డు ఇన్‌యాక్టివ్‌లో ఉందా? యాక్టివేట్ చేయడం ఎలా?