Recharge Plan : జియో, ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. గంటల లెక్కన ఇంటర్నెట్ డేటా?

Recharge Plan : ఇప్పటివరకు మనం చేసుకున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు రోజుకు ఇంత డేటా లేదా నెల మొత్తానికి ఇంత డేటా అనే ఉండేవి. కానీ ఇప్పుడు దేశంలోని టాప్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్ ఒక కొత్త దారిలో నడవడానికి సిద్ధమవుతున్నాయి. అదేంటంటే, ఇకపై ఇంటర్నెట్ డేటా గంటల లెక్కన కూడా దొరకబోతోందట.
జియో, ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ఏంటి?
రెండు కంపెనీలు కలిసి రూ.11 కి ఒక కొత్త డేటా ప్లాన్‌ను లాంచ్ చేశాయి. ఈ ప్లాన్‌లో 10GB హై-స్పీడ్ డేటా వస్తుంది. కానీ, ఇది కేవలం 1 గంటకు మాత్రమే ఉంటుంది. ఇది ఒక యాడ్-ఆన్ ప్లాన్ అన్నమాట. అంటే, మీరు ఇప్పటికే చేసుకున్న ఏదైనా రీఛార్జ్ ప్లాన్‌కు ఇది అదనంగా పనిచేస్తుంది. మొదట చూసినప్పుడు ఇది చిన్న ఆఫర్లా అనిపించొచ్చు. కానీ నిజానికి, ఇది మొబైల్ డేటాను మనం వాడే విధానాన్ని పూర్తిగా మార్చేసే కీలక అడుగు కావచ్చు.
Read Also:Phone Safety : ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..మీ ఫోన్ బాంబులా పేలొచ్చు!
డేటా ప్లాన్ ట్రెండ్ ఎలా మారుతుంది?
ఇప్పటివరకు భారతదేశంలో డేటా ప్లాన్లు ఎలా ఉన్నాయంటే.. రోజుకు 1.5GB డేటా వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, నెల రోజుల ప్యాక్ ఉంటుంది… ఇలా ఉండేవి. కానీ ఈ కొత్త ప్లాన్‌తో యూజర్ ఒక గంటలో ఎంత డేటా వాడినా, ఆ సమయానికి మాత్రమే డబ్బులు కడితే చాలు.
ఈ కొత్త ప్లాన్ కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో చాలా బాగా పనికొస్తుంది. కొన్ని నిమిషాల పాటు ఒక హై డెఫినిషన్ (HD) వీడియో చూడాల్సి వస్తే ఈ ప్లాన్ అద్భుతంగా పని చేస్తుంది. అలాగే అర్జెంట్‌గా ఏదైనా పెద్ద ఫైల్ లేదా ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది బాగుంటుంది. అకస్మాత్తుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అవసరం పడినప్పుడు, ఇంట్లో నుంచి పని చేస్తున్నప్పుడు జూమ్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవాలంటే, ఏదైనా కంటెంట్ అప్లోడ్ చేయాలన్నా లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలన్నా ఈ ప్లాన్ బాగుంటుంది.
Read Also:Heart Attack : పురుషుల కంటే భిన్నంగా మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారో అంతే
యూజర్లకు లాభమా, నష్టమా?
ఈ ప్లాన్ వల్ల లాభాల విషయానికి వస్తే.. మీ ఇష్టం వచ్చినట్లు డేటా వాడుకోవచ్చు.. మీరు మీ అవసరానికి తగ్గట్టుగా డేటాను వాడుకోవచ్చు. దీనివల్ల మీరు రోజంతా వాడే పెద్ద, ఖరీదైన ప్లాన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అర్జెంట్ అవసరాలకు ఇది చాలా బాగా పనికొస్తుంది.
నష్టాల విషయానికి వస్తే రోజంతా ఇంటర్నెట్ కావాల్సిన వాళ్ళకు ఈ ప్లాన్ అంతగా పనికిరాదు. ఒక గంట తర్వాత డేటా ఆగిపోతుంది, మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు నెట్వర్క్ సరిగా లేకపోతే, ఆ ఒక గంట కూడా వృథా అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా, ఈ కొత్త గంటల లెక్కన డేటా ప్లాన్ అవసరాన్ని బట్టి వాడేవారికి చాలా ఉపయోగపడుతుంది. కానీ, రెగ్యులర్‌గా ఇంటర్నెట్ వాడేవారికి మాత్రం రోజువారీ లేదా నెలవారీ ప్లాన్లే బెస్ట్ అని చెప్పొచ్చు.
-
BSNL : బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. ఇక మీద ఇంటివద్దకే సిమ్ కార్డ్
-
Mobile Data : ఇంటర్నెట్ వాడకంలో ఇండియా టాప్.. నెలకు ఒక వ్యక్తి ఎంత డేటా వాడుతున్నాడో తెలుసా?
-
Satellite internet: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. డైరెక్ట్‌గా శాటిలైట్ ఇంటర్నెట్
-
Starlink : జియోలాంటి ప్లాన్స్‌తో స్టార్‌లింక్ ఎంట్రీ..ఇంటర్నెట్ మార్కెట్లో మస్క్ సంచలనం!
-
Jio vs Airtel Recharge Plans: రూ.50 తేడాతో భారీ ప్రయోజనాలు: జియో 299 vs ఎయిర్టెల్ 349 ప్లాన్ ఏది బెస్ట్ ?
-
Jio: ఆన్లైన్ ఫుడ్ లవర్స్ కి గుడ్‌న్యూస్.. జియో నుంచి బంపర్ ఆఫర్