Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Why Are Heart Attack Symptoms Different In Women Than In Men

Heart Attack : పురుషుల కంటే భిన్నంగా మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారో అంతే

Heart Attack : పురుషుల కంటే భిన్నంగా మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారో అంతే
  • Edited By: rocky,
  • Updated on June 21, 2025 / 07:54 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Heart Attack : ప్రస్తుతం హార్ట్ ఎటాక్ అనేది చాలా తీవ్రమైన సమస్య. సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. కానీ కొద్దిగా ఆలస్యమైనా ప్రాణాలకే ప్రమాదం. సాధారణంగా ఛాతీలో తీవ్రమైన నొప్పి, ఎడమ చేయి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి హార్ట్ ఎటాక్ కు ప్రాథమిక సంకేతాలుగా భావిస్తారు. అయితే, మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే చాలా భిన్నంగా ఉంటాయట. చాలాసార్లు మహిళలు ఈ లక్షణాలను బలహీనత, అలసట లేదా గ్యాస్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. మరి మహిళల్లో గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ముందుగా తెలుసుకుందాం.

మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు
పెద్దగా పని చేయకపోయినా విపరీతమైన అలసటగా అనిపించడం మహిళల్లో గుండెపోటుకు అత్యంత సాధారణ లక్షణం. ఈ అలసట కొన్ని రోజులు లేదా వారాల పాటు ఉండవచ్చు, విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గదు. చాలాసార్లు మహిళల పైవీపు, మెడ, దవడ లేదా భుజంలో నొప్పి లేదా ఒత్తిడి అనిపించవచ్చు. ఈ నొప్పి నెమ్మదిగా పెరగవచ్చు. చాలా మంది మహిళలకు గుండెపోటు సమయంలో కడుపు నొప్పి, మంట లేదా భారంగా అనిపించవచ్చు. దీన్ని తరచుగా యాసిడిటీ లేదా గ్యాస్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే సమస్య తీవ్రంగా మారవచ్చు. గుండెపోటు సమయంలో మహిళలకు శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. వారు ఎలాంటి బరువైన పని చేయకపోయినా ఇలా జరగవచ్చు. మహిళల్లో వాంతులు, తల తిరగడం లేదా కళ్లు తిరగడం కూడా గుండెపోటు సంకేతాలు కావచ్చు.గుండెపోటుకు కొన్ని రోజుల లేదా వారాల ముందు మహిళలకు నిద్రపట్టకపోవడం, చికాకు లేదా ఆందోళన వంటి సమస్యలు కూడా ఉండవచ్చు.

Read Also:Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!

పురుషుల్లో గుండెపోటు లక్షణాలు
ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. అకస్మాత్తుగా చెమటలు పడుతాయి. కళ్లు తిరగడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది.

మహిళల్లో లక్షణాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి?
మహిళల రక్తనాళాలు బ్లాక్ అయ్యే విధానం, హార్మోన్ల మార్పులు, శరీర నిర్మాణం పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి.మహిళల్లో తరచుగా చిన్న ధమనులలో బ్లాకేజ్ వస్తుంది, దీనివల్ల ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉండదు.

Read Also:Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!

మహిళల్లో గుండెపోటు ప్రమాదం ఎందుకు ఎక్కువ?
మెనోపాజ్ తర్వాత మహిళల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం పురుషులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, జీవనశైలికి సంబంధించిన కారణాలు మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.మహిళల్లో లక్షణాలు అస్పష్టంగా ఉండటం వల్ల తరచుగా చికిత్సలో ఆలస్యం జరుగుతుంది.

ఎలా రక్షించుకోవాలి?
మహిళలు తమ శరీరంలో కనిపించే చిన్నపాటి సంకేతాలను కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.అవసరమైతే ఈసీజీ, రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ టెస్టులు చేయించుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం మానుకోవాలి.శరీరంలో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Tag

  • Back Pain
  • Chest Pain
  • Fatigue
  • Heart Attack
  • heart attack symptoms
Related News
  • Health Tips : మగవాళ్లు ఆరోగ్యానికి 5 ముఖ్యమైన అలవాట్లు.. ఈ సింపుల్ టిప్స్‌తో రోగాలకు చెక్!

  • Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

  • Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

  • Health Issues: ఆరోగ్యానికి మంచిదని ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇలా చేశారో.. అంతే సంగతులు

  • CPR: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా సీపీ ఆర్ చేస్తే.. ప్రాణాలు సేఫ్

  • Heart Patients: హార్ట్ పేషెంట్స్ నడవచ్చా.. నడిస్తే ఏమవుతుంది?

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us