Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Covid vaccine: ఈ మధ్య కాలంలో గుండె పోటులో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. అది కూడా ఎలాంటి సంకేతాలు లేకుండా ఆకస్మికంగా మరణిస్తున్నారు. తింటూ, డ్యాన్స్ వేస్తూ, చదువుతూ ఇలా ఏదో ఒక పని చేస్తున్నవారు ఒక్కసారిగా మృతి చెందుతున్నారు. అయితే ఒకప్పుడు రోజుల్లో ఇలా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం రోజుల్లో అయితే వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది చిన్న వయస్సులోనే ఇలా గుండె పోటుతో మృతి చెందుతున్నారు. అయితే వీటికి ముఖ్య కారణం కరోనా అని చాలా మంది భావిస్తున్నారు. కరోనా సమయంలో చాలా మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. కరోనా సోకితే మరణిస్తారని భయంతో ఎలాంటి ప్రాణ భయం లేకుండా వ్యాక్సిన్లు తీసుకున్నారు. అయితే వీటివల్లనే ఎక్కువగా వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు వంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది ఆరోపించారు. కానీ గుండె పోటుకి, కరోనా వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధ్యయనాలు చేసింది.
కరోనా తర్వాత ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరగడంతోనే ఈ అధ్యయనాలు చేసింది. పలువురు గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించడంతో కరోనా వ్యాక్సిన్లపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కారణంతోనే అధ్యయనాలు చేసింది. ఇందులో కొవిడ్-19 వ్యాక్సిన్లు చాలా సురక్షితమైనవని తేలింది. అయితే వీటివల్ల నష్టాలు ఎక్కువగా రావని ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదంతా ఫేక్ అని, కొందరు ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారని తెలిపింది. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇలాంటి సమస్యలు రావని వెల్లడించింది. మారిన జీవనశైలి వల్ల వస్తుందని తెలిపారు. కోవిడ్‌లో పోషకాలు ఉండే ఫుడ్ తీసుకుంటే సరిపోదు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా సరైన జీవనశైలి ఉంటేనే గుండె పోటు వంటి సమస్యలు రావని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జీవనశైలి ఎక్కువగా మారిపోయింది. చాలా మంది అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల చాలా మంది అకస్మిక గుండె పోటు వచ్చి మరణిస్తున్నారని వెల్లడించింది. ఏదైనా కూడా పోషకాలు ఉండే ఫుడ్‌ను తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని, ఇవి ఫేక్ అని అంటున్నారు.
Also read: Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
-
Health Issues: ఆరోగ్యానికి మంచిదని ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇలా చేశారో.. అంతే సంగతులు