Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!

Pani puri: వర్షాకాలం వచ్చేసింది. రాత్రి, పగలు తేడా లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు చాలా మందికి చల్లని పదార్థాలు కంటే వేడిగా ఉన్న పదార్థాలు బాగా నచ్చుతాయి. వేడిగా ఉండే పకోడీలు, బజ్జీలు, పానీపూరీలు ఇలా ఫాస్ట్‌ఫుడ్స్ నచ్చుతాయి. దీంతో వీరు ఈ వర్షా కాలంలో కొందరు ఎక్కువగా తింటారు. కాస్త వర్షం పడితే చాలు.. వెంటనే ఇలాంటి పదార్థాలను తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా కొందరు పానీపూరీ బాగా తింటారు. మిగతా రోజుల్లో కూడా పానీపూరీ తింటారు. కానీ ఈ వర్షాకాలంలో అయితే మరీ ఎక్కువగా పానీపూరీ తింటుంటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పానీపూరీలో ఎక్కువగా వాటర్ ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వర్షాకాలంలో పానీ పూరీ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
సాధారణంగా పానీ పూరీని సరిగ్గా శుభ్రంగా చేయరు. అలాంటి సమయాల్లో తింటేనే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వర్షా కాలంలో అయితే అసలు తినకూడదు. ఎందుకంటే ఈ వాటర్‌ను చింతపండుతో తయారు చేస్తారు. చేతులు కలిపి దీన్ని తయారు చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. పానీ పారీని తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బాగా వేయించిన ఫుడ్స్ కూడా వర్షా కాలంలో తీసుకోకూడదు. ఎందుకంటే బాగా వేయించిన నూనెలో వీటిని తయారు చేస్తారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ సీజన్‌లో పానీ పూరీ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మందగించడం, కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అసలు స్ట్రీట్ ఫుడ్‌ను ఈ వర్షా కాలంలో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల విరేచనాలు, పచ్చ కామెర్లు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు పండ్ల రసాలను కూడా బయట తాగుతుంటారు. వీటివల్ల కూడా ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో ఆకు కూరలను కూడా తీసుకోకూడదు. వీటివల్ల విరేచనాలు, ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆకు కూరలను డైరెక్ట్‌గా భూమి నుంచి తీస్తుంటారు. వీటికి ఎక్కువగా క్రిములు ఉంటాయి. ఈ సీజన్‌లో వాటర్ కూడా కాలుష్యం అవుతుంది. ఇలాంటి వాటర్‌తో వాటిని శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ పెరుగుతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ సీజన్‌లో పుట్టగొడుగు, ఇలాంటి ఆకుకూరలు, దుంప జాతి వాటిని కూడా తినవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also read : Ramayana movie first glimpse review: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఏదో మిస్ అవుతుంది
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
-
Health Issues: ఆరోగ్యానికి మంచిదని ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇలా చేశారో.. అంతే సంగతులు
-
Rainy Season: వర్షాకాలంలో ఇలా మొబైల్ యూజ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!
-
Banana: ఈ పండు తిన్న తర్వాత ఈ మిస్టేక్స్ చేశారో.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే