Ramayana movie first glimpse review: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఏదో మిస్ అవుతుంది

Ramayana movie first glimpse review: సీరియల్స్, సినిమాలు ఇలా ఎన్నిసార్లు స్టోరీలో వచ్చినా కూడా ఎప్పుడు బోర్ కొట్టనిది రామాయణం. హిందూ సంప్రదాయాలు, పద్ధతులతో ఎంతో భక్తితో కొందరు డైరెక్టర్లు రామాయణ స్టోరీని సరికొత్తగా డైరెక్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులను నచ్చే విధంగా వీటిని తీస్తున్నారు. అయితే దర్శకుడు నితేష్ తివారి మరోసారి ప్రేక్షకుల ముందుకు రామాయణ స్టోరీని సినిమా రూపంలో తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మూవీ టీం తాజాగా విడుదల చేసింది. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించగా, రావణాసురుడి పాత్రలో యశ్ నటిస్తున్నాడు. సీతగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే ఈ రామాయణ మూవీ షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది.
గతంలో ముంబైలో షూటింగ్ జరిగిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాటికి సంబంధించిన గ్లింప్స్‌ను మూవీ టీం రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌లో కేవలం రణబీర్ కపూర్, యశ్ మాత్రమే ఉన్నారు. వీరిద్దరి పాత్రలు కూడా పవర్ లుక్స్‌లో ఉన్నారు. రావణాసురుడి పాత్రలో యశ్ లుక్ అయితే అదిరిపోయింది. నిజంగా రావణాసురుడే అన్నట్లుగా ఉంది. రాముడి పాత్రకు రణబీర్ సరిగ్గా సెట్ అయ్యాడని ఈ లుక్ చూస్తే అనిపిస్తుంది. అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో కేవలం వీరిద్దరికి సంబంధించిన లుక్స్‌ను కంప్లీట్‌గా అయితే రివీల్ చేయలేదు. కేవలం సగం మాత్రమే రివీల్ చేశారు. మరి రాముడుగా, రావణాసురుడిగా వీరిద్దరిని కంప్లీట్‌గా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ రామాయణ మూవీకి ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో విజువల్స్ కూడా బాగున్నాయి. చాలా క్వాలిటీతో ఉన్నాయి. ఏదైనా కూడా దీని గురించి పూర్తిగా వస్తే తెలుస్తోంది. అయితే ఈ సినిమాను వీఎఫ్‌ఎక్స్ స్టూడియో డీఎన్‌ఈజీ, యాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రాబోతుంది. మొదటి పార్ట్ వచ్చే ఏడాది అనగా 2026లో దీపావళికి వస్తుంది. ఇక రెండో పార్ట్‌ను 2027కి రాబోతుంది. మొదటి పార్ట్ వచ్చే ఏడాది రానుండటంతో సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయి ఉంది. కాబట్టి త్వరలోనే ఈ పూర్తి గ్లింప్స్ లేదా సాయిపల్లవికి సంబంధించిన గ్లింప్స్ కానీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏదైనా మూవీ టీం అధికారికంగా ప్రకటిస్తేనే తెలుస్తుంది.