Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?

Ramayana : రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణం సినిమా గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీతనం మూడు నిమిషాల గ్లింప్స్ లో స్పష్టంగా కనిపించింది. ఈ గ్లింప్స్ చివరి కొన్ని సెకన్లలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా కనిపించారు. టీజర్‌లో వీరిద్దరి దృశ్యాలు కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ, నెటిజన్లు రణ్‌బీర్‌ను విమర్శిస్తూ, యశ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. రణ్‌బీర్ కపూర్‌పై వస్తున్న విమర్శలు ఎక్కువగా పక్షపాతంతో కూడుకున్నవి అని చెప్పవచ్చు. భీప్ తినేవాడు రాముడి పాత్రను చేశాడు, ధర్మం పట్ల గౌరవం లేని వాడు రాముడి పాత్ర చేశాడు అంటూ దారుణంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది రణ్‌బీర్ కపూర్ కంటే రామ్ చరణ్ రాముడి పాత్రకు బాగా సెట్ అయ్యే వారని అభిప్రాయపడుతున్నారు. ణ్‌బీర్ ముఖంలో శ్రీరాముడి గంభీరత్వం కనిపించడం లేదని అతని బాడీ లాంగ్వేజ్ పౌరాణిక పాత్రకు సెట్ కాదని పేర్కొన్నారు.
Read Also:Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?
టీజర్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించిన స్క్రీన్‌షాట్‌ను ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ శ్రీరాముడి వేషం ధరించిన చిత్రంతో కంపేర్ చేసి చూస్తున్నారు. రాముడి పాత్రకు రణ్‌బీర్ కంటే రామ్ చరణ్ నటించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమైంది. మరోవైపు, యశ్‌ను చాలా మంది ప్రశంసించారు. యశ్ రామాయణం సినిమాకు మరింత జోష్‌ను నింపారని అన్నారు. ఒక స్టార్ హీరో నటించిన సినిమా, ఆ సినిమా హీరో కారణంగా కాకుండా విలన్ కారణంగా ఇంతగా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి అని నెటిజన్లు యశ్ క్రేజ్‌ను పొగిడారు. టీజర్‌లో యశ్ ఒక కన్ను మాత్రమే చూపించారు. దీనిపై కూడా కొందరు స్పందిస్తూ కేవలం ఒక కన్ను చూపించినందుకే ఇంత క్రేజ్ ఉంటే ముఖం పూర్తిగా చూపించి ఉంటే క్రేజ్ మూడు రెట్లు పెరిగి ఉండేదని వ్యాఖ్యానించారు.
Read Also:Tholi Ekadasi: తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రామాయణం సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా , నటుడు యశ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత డీఈఎన్జీ స్టూడియో ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందించింది. ఆస్కార్ విజేతలైన సంగీత దర్శకులు హన్స్ జిమ్మర్, ఎ.ఆర్.రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. 2026 దీపావళికి సినిమా మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి.
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Ramayana : రామాయణం కోసం షాకింగ్ టెక్నాలజీ.. ఏకంగా 86 కెమెరాలతో షూటింగ్
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Ramayana Movie Budget: రామాయణ బడ్జెట్ ఇన్ని కోట్లా.. ఇండియాలో అధిక బడ్జెట్ మూవీ ఇదేనా!
-
Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లో మెరిసిన భారత ఆణిముత్యం