Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?

Rashmika : నటి రష్మిక మందన్న ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి విమర్శల పాలవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆమె మళ్ళీ ఒక వ్యాఖ్య చేసి మరోసారి నెటిజన్ల విమర్శలకు గురైంది. “కోడవ కమ్యూనిటీ నుండి సినీ పరిశ్రమకు వచ్చిన మొదటి వ్యక్తిని నేను ఒక్కదాన్నే అనుకుంటున్నాను” అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యపై చాలా మంది నెటిజన్లు రష్మికను విమర్శిస్తూ, కోడవ కమ్యూనిటీ నుండి వచ్చి ఇండస్ట్రీలో రాణించిన వారి పేర్లను కూడా ప్రస్తావించారు.
రష్మిక మందన్న తరచుగా కన్నడిగుల నుండి విమర్శలు ఎదుర్కొంటుంది. దీనికి ప్రధాన కారణం ఆమె చేస్తున్న కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు. గతంలో కూడా రష్మిక ఇలాంటి పొరపాట్లు చాలా సార్లు చేసింది. ఇప్పుడు ఆమె “కోడవ కమ్యూనిటీ నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చింది నేను ఒక్కదాన్నే” అని ఒక కొత్త ప్రకటన చేసింది.
మొజో స్టోరీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ, “మా కోడవ కమ్యూనిటీ నుండి ఎవరూ సినిమా ఇండస్ట్రీకి రాలేదు. బహుశా, మా కమ్యూనిటీ నుండి సినీ పరిశ్రమకు వచ్చిన మొదటి వ్యక్తిని నేను ఒక్కదాన్నే. మా కమ్యూనిటీ వారు చాలా త్వరగా తీర్పులిస్తారు. అందుకే నేను ఆడిషన్స్ ఇస్తున్న విషయం కూడా మా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. సినీ పరిశ్రమలోకి వెళ్తున్నానని కూడా వారికి తెలియజేయలేదు” అని రష్మిక అన్నారు.
Read Also:Jackky Bhagnani: దివాలా తీసిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. క్లారిటీ ఇచ్చిన జాకీ భగ్నానీ..!
ప్రస్తుతం రష్మిక చేసిన ఈ వ్యాఖ్యపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత సినీ పరిశ్రమలో ఎంతో గుర్తింపు పొందిన ప్రేమ కూడా కోడవ కమ్యూనిటీకి చెందినవారే. ఆమె కూడా అప్పట్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రష్మిక పుట్టే నాటికే ప్రేమ ఇండస్ట్రీకి వచ్చి ఏడాది గడిచిందని చాలా మంది గుర్తు చేస్తున్నారు. ప్రేమ గురించి రష్మికకు తెలియదని అనడం హాస్యాస్పదంగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇక, కోడవ కమ్యూనిటీ నుండి సినీ పరిశ్రమకు వచ్చిన వారి జాబితా చాలా పెద్దది. హర్షికా పూనచ్చ, కృషి తాపండ, నిధి సుబ్బయ్య, డైసీ బోపన్న, శ్వేతా చంగప్ప వంటి చాలా మంది నటీమణులు ఇండస్ట్రీలో ఇప్పటికే రాణిస్తున్నారు. కానీ రష్మిక మాత్రం తన లోకంలో తానే ఉన్నట్లుగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Read Also:Dosa Batter Tips: ఫ్రిడ్జ్ లేకుండా.. దోశ పిండి ఎక్కువగా నిల్వ ఉంచుకోవడం ఎలా?
-
Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Hari hara veera mallu movie: హరి హర వీర మల్లుకు బిగ్ షాక్.. విడుదల కష్టమే!
-
Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!
-
Rashmika : ‘మైసా’ పోస్టర్‌తో బయటపడిన విజయ్, రష్మిక బంధం