Jackky Bhagnani: దివాలా తీసిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. క్లారిటీ ఇచ్చిన జాకీ భగ్నానీ..!

Jackky Bhagnani: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. ఒకప్పుడు వరుస హిట్‌లతో అలరించిన రకుల్ ఇప్పుడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రకుల్‌కు పెద్దగా ఆఫర్లు లేవు. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడ ఈమెకు బాగా ఆఫర్లు తగ్గిపోయాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. దీంతో రామాయణ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక్క పాత్ర చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మూవీ టీం ఇటీవల విడుదల చేసింది. అయితే స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈమె ఒక్కసారిగా క్యారెక్టర్ పాత్రలు చేయడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అయితే రకుల్ మ్యారేజ్ లైఫ్ కూడా బాగాలేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తన భర్త జాకీ భగ్నానీ దివాలా తీశాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. జాకీ బిజినెస్ మ్యాన్ కావంతో పాటు బాలీవుడ్ నిర్మాత. అయితే జాకీ గతేడాది ‘బడే మియా..చోటే మియా’ అనే భారీ బడ్జెట్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో స్టార్ నటుడు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో జాకీ భగ్నానీ పెద్ద మొత్తంలో నష్టపోయాడని, ఈ అప్పును తీర్చడానికి వారి ఆఫీస్, ఇంటిని కూడా తాకట్టు పెట్టినట్లు జోరుగా ప్రచారం జరిగింది. జాకీ భగ్నానీకి భారీ అప్పు ఉందని, దివాలా తీశాడని బాగా వైరల్ చేశారు. తన భర్త చేసిన అప్పులను తీర్చడానికి రకుల్ సినిమాల్లో నటించాలని అనుకుంటుందని చాలా మంది అన్నారు. అయితే ఈ ఘటనపై రకుల్ భర్త జాకీ భగ్నానీ స్పందించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా అప్పు గురించి మాట్లాడారు.
గతంలో బడే మియా చోటే మియా మూవీ కోసం జుహు కార్యాలయాన్ని తాకట్టు పెట్టాను. అయితే ఇప్పుడు దాన్ని నేను వెనక్కి కూడా తీసుకోగలనని అన్నారు. సినిమా తీయడం వల్ల అప్పులు అయిపోయానని, అందుకే ఈ భవనం అమ్మేశానని, నా దగ్గర డబ్బులు లేవని, అందుకే నాకు ఎవరూ అప్పులు ఇవ్వడం లేదని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ ఎలా వచ్చాయో తనకి తెలియదని, కాకపోతే వీటిని పట్టించుకునేంత సమయం తనకు లేదన్నారు. ఈ రూమర్స్‌ను ప్రచారం చేసిన వారిని నిందించాలని అనుకోవడం లేదు.. కాకాపోతే వీటి గురించి ఆలోచించే సమయం తన దగ్గర లేదని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఎక్కి ఎక్కి ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు
-
Ramayana Movie Budget: రామాయణ బడ్జెట్ ఇన్ని కోట్లా.. ఇండియాలో అధిక బడ్జెట్ మూవీ ఇదేనా!
-
Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?
-
Kaviya Maran : కావ్య మారన్ ఇంట్లో కుమ్ములాట..మార్కెట్లో భూకంపం.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Rakul Preet Singh: తెలుగులో వరుసగా 8 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఎవరంటే..